సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ గత ఏడాది చివర్లో భారత మార్కెట్లో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దాని విశిష్టమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు సరసమైన ధర వంటి అనేక అంశాల కారణంగా, కియా సోనే అదికొద్ది కాలంలోనే భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత శక్తివంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

ఈ నెల ఆరంభంలో, కియా మోటార్స్ తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్ లైనప్‌ను అప్‌గ్రేడ్ చేసి, కొత్త ఫీచర్లను జోడించింది. ఇందులో దాదాపుగా 10 కొత్త అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ లైనప్‌లో కంపెనీ కొత్త రెండు వేరియంట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

కాగా, ఇప్పుడు ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ తమ అధికారిక యాక్ససరీల జాబితాను మరియు వాటి ధరల వివరాలను వెల్లడి చేసింది. కియా సోనెట్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లను మరింత అందంగా తీర్చిదిద్దడంలో ఈ యాక్ససరీస్ ఉపయోగపడుతాయి.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

అంతేకాకుండా, కస్టమర్ల సౌకర్యార్థం కూడా కంపెనీ కొన్ని రకాల యాక్ససరీలను అందిస్తోంది. ఎక్స్టీరియర్ యాక్ససరీలలో ఈ ఎస్‌యూవీని మరింత ప్రీమయంగా కనిపించేలా చేసేందుకు కంపెనీ ఓ క్రోమ్ ప్యాక్‌ను అందిస్తోంది. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్స్, సైడ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, ఫాగ్ లాంప్స్, వీల్ ఆర్చెస్, రియర్ రిఫ్లెక్టర్లు మరియు విండో ఫ్రేమ్‌ల కోసం క్రోమ్ గార్నిష్ అందుబాటులో ఉంటాయి.

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

ఇంకా, మడ్ ఫ్లాప్స్, బంపర్ ప్రొటెక్టర్లు, బాడీ సైడ్ మోల్డింగ్స్ మరియు డోర్ వైజర్స్ వంటి అదనపు ఎక్స్టీరియర్ యాక్ససరీలు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో భాగంగా, కంపెనీ నాలుగు రకాల సీట్ కవర్ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాకుండా, పివిసి మ్యాట్స్, విండ్‌స్క్రీన్ మరియు వెనుక కిటికీల కోసం టింటింగ్, కీ కవర్, వాక్యూమ్ క్లీనర్ మరియు హెడ్‌రెస్ట్ పిల్లోస్ వంటి ఇతర యాక్ససరీలు కూడా ఉన్నాయి.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

కియా మోటార్స్ తమ సోనెట్ కోసం అందిస్తున్న యాక్ససరీలు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

 • మడ్ ఫ్లాప్ - రూ.489
 • బంపర్ ప్రొటెక్టర్లు శాటిన్ బ్లాక్ - రూ.770
 • హెడ్ లాంప్ క్రోమ్ గార్నిష్ - రూ.999
 • టెయిల్ లాంప్ క్రోమ్ గార్నిష్ - రూ.1,299
 • ఫాగ్ లాంప్ క్రోమ్ గార్నిష్ - రూ.629
 • ట్విన్ హుడ్ స్కూప్స్ - రూ.999
 • సైడ్ మిర్రర్స్ క్రోమ్ గార్నిష్ - రూ.799
 • వీల్ ఆర్చెస్ క్రోమ్ గార్నిష్ - రూ.1,799
 • సైడ్ ఫిన్స్ - రూ.799
 • బాడీ సైడ్ మోల్డింగ్ క్రోమ్ గార్నిష్ - రూ.1,990
 • విండో బీడింగ్ క్రోమ్ గార్నిష్ - రూ.1,639
 • సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్
  • డోర్ వైజర్ - రూ.2,279
  • డోర్ హ్యాండిల్ క్రోమ్ గార్నిష్ - రూ.909
  • ఫింగర్ గార్డ్ క్రోమ్ గార్నిష్ - రూ.899
  • సైడ్ స్టెప్ - రూ .14,999
  • బూట్ డోర్ క్రోమ్ గార్నిష్ - రూ.789
  • డోర్ సిల్ గార్డ్ - రూ.779
  • రియర్ రిఫ్లెక్టర్ గార్నిష్ - రూ.649
  • నంబర్ ప్లేట్ సిల్వర్ గార్నిష్ - రూ.799
  • డోర్ స్ట్రైకర్ కవర్ - రూ.439
  • బ్లైండ్ స్పాట్ మిర్రర్ - రూ.939
  • MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

   సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్
   • కార్ కవర్ - రూ.4,109
   • క్యాబిన్ మ్యాట్స్ - రూ.1,359 నుండి రూ.2,799 వరకు
   • ట్రంక్ మ్యాట్ - రూ.1,885
   • సన్‌షేడ్ - వెనుక విండో - రూ.919
   • సన్‌షేడ్ - ముందు విండో - రూ.1,649
   • హెడ్ రెస్ట్ కుషన్ - ర .1,249
   • కీ కవర్ - రూ.626
   • సీట్ కవర్లు - రూ.5,242 నుండి రూ.5,512 వరకు
   • వాక్యూమ్ క్లీనర్ - రూ.2,169
   • సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

    భారత మార్కెట్లో కియా మోటార్స్ తమ అప్‌డేటెడ్ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూ.6.79 లక్షల నుండి రూ.13.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విక్రయిస్తోంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో కంపెనీ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడంతో పాటుగా ఇందులో అదనపు ఫీచర్లను కూడా జోడించింది. ఈ కొత్త 2021 మోడళ్లన్నీ కూడా కంపెనీ యొక్క సరికొత్త లోగోతో వస్తాయి.

    MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

    సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

    కొత్త కియా సోనెట్ ఇప్పుడు పాడిల్ షిఫ్టర్‌లతో రానుంది. ఈ పాడిల్ షిఫ్టర్లు కారు స్టీరింగ్ వెనుకన అమర్చబడి ఉంటాయి. ఇది గేర్ లివర్ మాదిరిగా పనిచేస్తుంది. డ్రైవింగ్ సమయంలో సులువుగా గేర్లను పెంచడానికి లేదా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో సెగ్మెంట్-ఫస్ట్ వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్ ఆపరేషన్ మరియు వెనుక విండో సన్‌షేడ్‌లు మొదలైనవి కూడా ఉన్నాయి.

    సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం లేటెస్ట్ యాక్ససరీస్‌ను వెల్లడించిన కియా మోటార్స్

    అంతేకాకుండా, కియా సోనెట్ హెచ్‌టిఎక్స్ వేరియంట్ ఇప్పుడు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌ను మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఏటి గేర్‌బాక్స్ ఆప్షన్‌తోనూ లభ్యం కానున్నాయి. ఈ కొత్త వేరియంట్లు ఇప్పుడు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ల క్రింద ఉంచబడ్డాయి.

Most Read Articles

English summary
Kia Motors Reveals New Accessories Details For 2021 Sonet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X