ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors). కంపెనీ దేశీయ మార్కెట్లో కియా సోనెట్, కియా కార్నివాల్ మరియు కియా సెల్టోస్ వంటి మోడల్స్ విడుదల చేసి మంచి ప్రజాదరణ పొందుతూ ఇప్పటికీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించింది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

ప్రస్తుతం భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగంవైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి ఆదరణ పొందుతున్నాయి. కావున ఈ నేపథ్యంలో భాగంగానే కియా మోటార్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తాయారు చేయడానికి సంకల్పించింది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో ఆల్-ఎలక్ట్రిక్ SUV కియా ఈవి9 (Kia EV9) పేరుతో విడుదల చేయనుంది. కంపెనీ అందిచిన తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త SUV 2021 నవంబర్ 11 న అంటే రేపు ప్రదర్శించనుంది. అయితే దానికంటే ముందు కియా మోటార్స్ యొక్క రాబోయే ఎలక్ట్రిక్ SUV యొక్క టీజర్‌ను విడుదల చేసింది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

రానున్న కొత్త కియా ఎలక్ట్రిక్ కారు యొక్క టీజర్ మీరు గమనించినట్లయితే ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఈ టీజర్ చిత్రం ప్రకారం Kia EV6 కంటే సైజులో చాలా పెద్దదని కారు యొక్క సిల్హౌట్ సూచిస్తుంది. కంపెనీ విడుదల చేసిన Kia EV9 యొక్క టీజర్ చిత్రం SUV కియా టెల్లూరైడ్ మాదిరిగానే వైబ్‌తో అందించబడుతుందని సూచిస్తుంది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Kia EV9 ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ గ్రూప్ బ్రాండ్ యొక్క EV ఆర్కిటెక్చర్ E-GMP ఆధారంగా ఉంటుందని తెలుస్తుంది. కియా మోటార్స్ దీనిని బలమైన మరియు బోల్డ్ SUV గా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

ప్రస్తుతం, ఈ కొత్త కియా ఎలక్ట్రిక్ SUV గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ కంపెనీ యొక్క ఇతర ఆధునిక కియా కార్ల మాదిరిగానే ఇది ఫ్లాట్ ఫేస్‌తో వస్తుందని టీజర్ చిత్రం ద్వారా వెల్లడవుతుంది. ఇది కూడా కంపెనీ యొక్క ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

కొత్త కియా ఎలక్ట్రిక్ SUV యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED టైల్‌లైట్లు మరియు LED హెడ్‌ల్యాంప్‌లతో అందించనుంది. అంతే కాకుండా ఇది ఫ్లాట్ రూఫ్ మరియు వెనుక వైపున రూఫ్ స్పాయిలర్‌ను కూడా పొందుతుంది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

కియా మోటార్స్ ఇప్పటికే అందించిన అధికారిక సమాచారం ప్రకారం, 2027 సంవత్సరం నాటికి E-GMP ఆర్కిటెక్చర్ ఆధారంగా మొత్తం ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలన్నింటికీ EV1 మరియు EV9 మధ్య పేర్లు పెట్టడం గమనించదగ్గ విషయం.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కార్లలో SUV లు కూడా ఉన్నాయి. కియా మోటార్స్ త్వరలో ప్రవేశపెట్టనున్న తన కొత్త EV9 ఎలక్ట్రిక్ SUV యొక్క పవర్‌ట్రెయిన్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ ఇందులో, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చని భావిస్తున్నాము.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

కియా కంపెనీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ కనీసం రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక్కొక్కటి యాక్సిల్‌తో ఉపయోగించాలని భావిస్తున్నారు. Kia EV6 ప్రస్తుతం ఒక జత డ్యూయల్-మోటార్ లేఅవుట్‌లను పొందుతోంది. Kia EV6 యొక్క ఎలక్ట్రిక్ మోటార్ 325 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఆవిష్కరణకు సిద్దమవుతున్న Kia EV9 ఎలక్ట్రిక్ SUV: పూర్తి వివరాలు

అయితే త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న Kia EV9 ప్రస్తుత Kia EV6 కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్ ఇవ్వగలదని భావిస్తున్నారు. కంపెనీ యొక్క E-GMP ఆర్కిటెక్చర్ 800 V ఛార్జింగ్ చేయగలదు మరియు వెనుక మరియు నాలుగు చక్రాల డ్రైవ్ పవర్‌ట్రైన్‌లను కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, మార్కెట్లో మంచి ఆదరణ పొందనుంది, అని ఆశిస్తున్నాము. అంతే కాకుండా ఇది దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ SUV లకు సరైన ప్రత్యర్థిగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia set to unveil new electric suv ev9 on 11th november details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X