Just In
- 1 hr ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 4 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 4 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
తెలంగాణా రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్: దేశంలోనే తొలిసారి, కేటీఆర్ ట్వీట్
- Sports
ఒక మ్యాచ్..ఇద్దరు మలయాళీలు: ఒకరు ఆకాశానికి..మరొకరు పాతాళానికి: ఎందుకిలా?
- Lifestyle
కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...
- Movies
నైట్ కర్ఫ్యూలో షూటింగ్ చేస్తున్న ఒకే ఒక్క హీరో.. ఆయన కోసమే స్పెషల్ పర్మిషన్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కియా సోనెట్ 7-సీటర్ వెర్షన్ విడుదల, వివరాలు
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గుర్తుందా? కియా సోనెట్ ఇప్పటి వరకూ కేవలం 5-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ 7-సీటర్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది.

అయితే, కియా సోనెట్ 7-సీటర్ ప్రస్తుతానికి ఇండోనేషియా మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది. భారత మార్కెట్లో ఈ మోడల్ విడుదల గురించి ఇంకా ఎలాంటి ధృవీకరణలు చేయలేదు. డిజైన్ పరంగా 5-సీటర్ సోనెట్‌కి మరియు 7-సీటర్ సోనెట్‌కి పెద్ద మార్పులు ఏవీ లేవు.

కొత్త 7-సీటర్ సోనెట్‌లో మూడవ వరుసలో సీట్లతో పాటుగా అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఈ కారులో మూడవ వరుస సీట్లను జోడించడం కోసం కంపెనీ దీని పొడవును స్వల్పంగా పెంచింది. ఇండోనేషియన్ మార్కెట్లో విడుదలైన సోనెట్ 7-సీటర్ పొడవు 4120 మి.మీగా ఉంటుంది. అదే భారత మార్కెట్లో లభిస్తున్న సోనెట్ 5-సీటర్ వెర్షన్ పొడవు 3995 మి.మీగా ఉంటుంది.
MOST READ:భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

కియా సోనెట్ 7-సీటర్ వెడల్పు 1790 మి.మీ, ఎత్తు 1642 మి.మీ మరియు వీల్‌బేస్ 2500 మి.మీగా ఉంటుంది. ఇందులో మూడవ వరుస సీటింగ్ మినహా మిగిలిన డిజైన్ మరియు క్యాబిన్ లేఅవుట్ మొత్తం స్టాండర్డ్ 5-సీటర్ సోనెట్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో అదనపు ఫీచర్లు లభిస్తాయి.

కియా సోనెట్ 7-సీటర్‌లో ఫుల్ కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, రియర్ ఏసి వెంట్స్, ఎల్‌ఇడి యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఇంకా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు అదనపు రూఫ్ మౌంటెడ్ బ్లోవర్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ కారు కంపెనీ యొక్క లేటెస్ట్ యువో కనెక్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. దీని సాయంతో ఇంటర్నెట్ యాక్సెస్, సేఫ్టీ అలారం, వాహన భద్రత, నిర్వహణ, నావిగేషన్ మరియు రిమోట్ యాక్సెస్‌కు సంబంధించిన ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

ఇంజన్ విషయానికి వస్తే, కియా సోనెట్ 7-సీటర్ మోడల్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని, 144 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

కియా సోనెట్ ప్రస్తుతం భారతదేశంలో కేవలం 5-సీటర్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. అయితే, భారతదేశంలో 7-సీటర్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.
MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ