భారత్‌లో విడుదలైన Kia Sonet యానివెర్సరీ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Kia Motors దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో సెల్టోస్, కార్నివాల్ మొదలైన మోడల్స్ ప్రవేశపెట్టి మంచి ఆదరణతో ముందుకు సాగుతుంది. అయితే కంపెనీ యొక్క పాపులర్ మోడల్స్ లో ఒకటి Kia Sonet (కియా సోనెట్). ఈ SUV విడుదలైనప్పటి నుంచి కూడా చాలా గొప్ప అమ్మకాలను సొంతం చేసుకోగలిగింది.

ఈ నేపథ్యంలో భాగంగానే కియా కంపెనీ కొత్త కియా సోనెట్ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

Kia Motars దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త Kia Sonet ధర రూ. 10.79 లక్షలు. కియా సోనెట్ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.అవి మాన్యువల్, ఆటోమేటిక్, IMT మరియు DCT గేర్‌బాక్స్ వేరియంట్స్. ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ గేర్‌బాక్స్‌ల ఆప్సన్స్ అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

Kia Sonet యొక్క నాలుగు వేరియంట్స్ యొక్క ధరలు ఇలా ఉన్నాయి.

  • కియా సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ 1.0 టర్బో పెట్రోల్ ఐఎమ్‌టి - రూ. 10.79 లక్షలు
  • కియా సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ 1.0 టర్బో పెట్రోల్ డిసిటి - రూ. 11.49 లక్షలు
  • కియా సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ 1.5 డీజిల్ మ్యాన్యువల్ - రూ. 11.09 లక్షలు
  • కియా సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ 1.5 డీజిల్ ఆటోమాటిక్ - రూ. 11.89 లక్షలు
  • భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

    అవి

    1. అరోరా బ్లాక్ పెర్ల్
    2. గ్లేసియర్ వైట్ పెర్ల్
    3. స్టీల్ సిల్వర్
    4. గ్రావిటీ గ్రే
    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    కియా సోనెట్ అనేది కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్, దాని అమ్మకాలు ఒక సమత్సరంలో 1 లక్ష దాటింది. ఇప్పుడు ఈ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ డిజైన్ పెద్ద అడవి ఎద్దు నుంచి స్ఫూర్తి పొందింది. కావున ఇది మరింత దూకుడు రూపాన్ని పొందుతుంది. ఇది టాంజానైన్ యాక్సెంట్స్ తో ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్‌లను పొందుతుంది. కొత్త కియా సొనెట్ యొక్క స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకమైన టైగర్ నోస్ గ్రిల్ పొందుతుంది. అంతే కాకుండా ఈ చిన్న SUV కి ఆరోచ్ సైడ్ స్కిడ్ ప్లేట్ ఇవ్వబడింది. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    సోనెట్ యానివెర్సరీ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ కాగా, మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్.

    ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

    ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 100 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసినప్పుడు, 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    కియా మోటార్స్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో సోనెట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ SUV కేవలం ఒక సంవత్సరం లోపల, కంపెనీ భారీ అమ్మకాలను సాధించింది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలకు చాలా వరకు దోహదపడింది.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    భారతదేశంలో కంపెనీ మొత్తం అమ్మకాలలో 32 శాతం సొనెట్ ఎస్‌యూవీల అమ్మకాల ద్వారా వచ్చినట్లు కియా చెప్పారు. కియా సెల్టోస్ మరియు కార్నివాల్ తర్వాత భారతదేశంలో సోనెట్ కంపెనీ మూడవ మోడల్. ఈ సంవత్సరం మేలో, కంపెనీ సొనెట్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కొత్త మోడల్‌కు అనేక అప్‌డేట్‌లు మరియు కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    కియా సొనెట్ యొక్క కొత్త మోడల్స్ కంపెనీ UVO కనెక్టెడ్ టెక్నాలజీని పొందాయి, ఇది 58 కనెక్ట్ ఫీచర్లను అందిస్తుంది. కియా సొనెట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-ఫంక్షన్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, మల్టిపుల్ ట్రాక్షన్ మోడ్స్ మరియు రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటివి ఉన్నాయి.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    వైరస్‌ల నుండి రక్షించడానికి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఈ కొత్త వేరియంట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ SUV లో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటుంది.

    భారత్‌లో విడుదలైన Kia Sonet స్పెషల్ ఎడిషన్: ధర రూ. 10.79 లక్షలు

    కియా సొనెట్ దేశీయ మార్కెట్లో విడుదలై ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, ఈ SUV యొక్క స్పెషల్ ఎడిషన్ ప్రారంభించబడింది. ఈ కొత్త ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త SUV ఎలాంటి అమ్మకాలను చేపడుతుందో త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Kia sonet first anniversary edition launched price look features engine details
Story first published: Thursday, October 14, 2021, 15:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X