పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ గతేడాది (2020లో) భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్, ఇప్పుడు సౌదీ అరేబియా మార్కెట్లో కూడా విడుదలైంది. మనదేశంలో 4 మీటర్ల కన్నా తక్కువ పొడవునున్న కియా సోనెట్, సౌదీ మార్కెట్ కోసం కాస్తంత పొడవు పెరిగింది.

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

ఇంటర్నేషనల్ వెర్షన్ కియా సోనెట్ పొడవు 4,120 మి.మీగా ఉంది. భారత మార్కెట్లో లభిస్తున్న కియా సోనెట్ పొడవు 3,995 మి.మీగా ఉంటుంది. ఇండియా-స్పెక్ మోడల్‌తో పోలిస్తే, అంతర్జాతీయ-స్పెక్ కియా సోనెట్ 125 మి.మీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

కాగా, ఈ ఇంటర్నేషల్ వెర్షన్ కియా సోనెట్‌లో పెరగిన పొడవు మినహా వెడల్పు, ఎత్తు మరియు వీల్‌బేస్‌లు మాత్రం ఒకేలా ఉంటాయి. ఈ ఎస్‌యూవీ వెడల్పు 1,790 మి.మీ మరియు ఎత్తు 1,642 మి.మీ మరియు వీల్‌బేస్ 2,500 మి.మీగా ఉంటుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

అంతర్జాతీయ-స్పెక్ కియా సోనెట్‌లో భారీగా కనిపించే ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను ఉపయోగించారు. పెరిగిన బంపర్ల పొడవు కారణంగా, కారు మొత్తం పొడవు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. అయితే, క్యాబిన్ లోపల స్థలం మాత్రం యధావిధిగా ఉన్నట్లు సమాచారం.

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

సౌదీ అరేబియాలో విడుదలైన కియా సోనెట్ ఇప్పుడు మరింత శక్తివంతమైన పెద్ద 1.5 లీటర్ ఇంజన్‌తో లభిస్తుంది. మనదేశంలో లభిస్తున్న కియా సోనెట్ 118 బిహెచ్‌పి, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 82 బిహెచ్‌పి, 1.2 లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్, 113 బిహెచ్‌పి మరియు 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, మనదేశంలో కియా సోనెట్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్, సిక్స్-స్పీడ్ మాన్యువల్, సిక్స్-స్పీడ్ ఐఎమ్‌టి, సెవన్-స్పీడ్ డిసిటి మరియు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

అరేబియా మార్కెట్లో విడుదలైన కియా సోనెట్ 1.5-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇదే ఇంజన్‌ను కంపెనీ తమ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి మార్కెట్లో ఇది ఇంటెన్సివ్ రెడ్, అరోరా బ్లాక్ పెరల్, బేజ్ గోల్డ్, గ్లాసీయర్ వైట్ పెరల్, ఐరన్ గ్రే, ఇంటెలిజెన్స్ బ్లూ, గ్రావిటీ గ్రే మరియు క్లియర్ వైట్ అనే ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే, అరేబియా మార్కెట్లలో విడులైన కియా సొనెట్ ఎస్‌యూవీలో ఎల్ఈడి డిఆర్‌ఎల్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, సన్‌రూఫ్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడి సౌండ్ మూడ్ లైట్లు, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

పెద్ద సైజ్ మరియు పెద్ద ఇంజన్‌తో కియా సోనెట్; కానీ ఇది వారికి మాత్రమే..!

ఇంకా ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, కనెక్ట్ కార్ టెక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia Sonet Launched Saudi Arabia; Gets Longer Tail And Bigger Engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X