ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా దాదాపు అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

లంబోర్ఘిని కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల కోసం తన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. దీని కింద పదేళ్ల ప్రణాళిక గురించి కంపెనీ క్షుణ్ణంగా వివరించింది. ఇందులో భాగంగానే కంపెనీ తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి ముందు హైబ్రిడ్ కార్లు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

లంబోర్ఘిని కంపెనీ విడుదల చేసిన ప్రణాళిక ప్రకారం, 2021 వ సంవత్సరంలో వి 21 సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ సిద్దమైంది. తరువాత త్వరితగతిన ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్ధం కానుంది. కావున లంబోర్ఘిని ఇప్పుడు ఈ లైన్‌లో చేరి తన ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రణాళికలను ప్రకటించింది.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

ఇందులో కూడా మొదటి దశలో ఐసి ఇంజన్లతో రెండు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది. తరువాత రెండో దశలో హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేయనుంది. మొదటి హైబ్రిడ్ సూపర్ కార్ 2023 లో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 నాటికి మొత్తం సిరీస్ విద్యుదీకరించబడుతుందని కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో తేలికపాటి కార్బన్ ఫైబర్ పదార్థాలను కంపెనీ ఉపయోగించుకుంటుంది. దీనికోసం లంబోర్ఘిని 1.5 బిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడి మొత్తం కంపెనీ యొక్క విద్యుదీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ పెట్టుబడి 2025 కి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 50% తగ్గించడానికి కూడా చాలా ఉపయోగించబడుతుంది.

MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

ఇది లంబోర్ఘిని కంపెనీ యొక్క చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి కానుంది. మూడవ మరియు చివరి దశ విషయానికొస్తే, ఈ దశలో లంబోర్ఘిని యొక్క మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును కంపెనీ విడుదల చేయనుంది. కంపెనీ టెక్నాలజీ ఆధునీకరణలో పెట్టుబడులు పెడుతోంది.

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

కావున ఈ విభాగంలో కొత్త ఉత్పత్తులను హోసే అవకాశం ఉంటుంది. లంబోర్ఘిని కంపెనీ 2030 తరువాత కూడా ఒక స్థిరమైన వ్యూహంపై పనిచేస్తుంది. లంబోర్ఘిని కంపెనీ కొత్త దిశలో పయనిస్తున్నప్పటికీ దాని మూలలను వదిలివేసి అవకాశం ఉండదు. అయితే ఈ సూపర్ కార్ల తయారీదారు ఈ ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి రంగంలో ఎలా ప్రయాణిస్తుందో వేచి చూడాలి.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో ఈక్యూ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఆడి ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎ ట్రోన్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. టెస్లా త్వరలో తన కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. వచ్చే దశాబ్దంనాటికల్లా ఎలక్ట్రిక్ సూపర్ కార్లు భారతదేశంలో విక్రయించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Lamborghini Announces Its Plans About Electric Car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X