భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్ఘిని భారత మార్కెట్‌కు మరొక సరికొత్త కారును పరిచయం చేయబోతోంది. ఈ కంపెనీ గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా విడుదల చేయనుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

తాజా సమాచారం ప్రకారం, లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను జూన్ 8, 2021 న భారతదేశంలో విడుదల చేయనున్నారు. ఈ కొత్త సూపర్ కార్ దాని కాస్మెటిక్ డీటేల్స్‌ను ఆర్‌డబ్ల్యుడి కూప్ మోడల్‌తో పంచుకుంటుంది మరియు అదే ఇంజన్‌తో పనిచేస్తుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

లాంబోర్ఘిని గత ఏడాది జనవరి 2020 నెలలో భారత మార్కెట్లో తమ హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి మోడల్‌ని విడుదల చేసింది. అప్పట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.3.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఇప్పుడు ఇదే కారుకి కొనసాగింపుగా, స్పెషల్ ఎడిషన్ రూపంలో కంపెనీ ఈ కొత్త హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను తీసుకొస్తుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

సరికొత్త 2021 లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ధర దాని స్టాండర్డ్ వెర్షన్ హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి ధర కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా. లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ సూపర్ కారు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉండి, లైఫ్‌స్టైల్ ఎంపికగా ఉంటుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

ఈ సూపర్ కార్ పెద్ద ఫ్రేమ్డ్ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్‌లలో కొత్త ఫ్రంట్ స్ప్లిటర్ మరియు వెర్టికల్ ఫిన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యూడి స్పైడర్‌లో ప్రత్యేకమైన కొత్త డిఫ్యూజర్‌ను కలిగి ఉన్న హై గ్లోస్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడిన రియర్ బంపర్‌ను ఉంటుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

ఇదొక కన్వర్టిబల్ బాడీ టైప్ కలిగిన కారు, దీని సాఫ్ట్-టాప్ రూఫ్ (పైకప్పు)ను కేవలం 17 సెకన్లలోపే తెరవవచ్చు మరియు గంటకు 50 కిమీ వేగంతో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ సాఫ్ట్-టాప్ ఓపెన్‌లో ఉన్నా లేదా క్లోజ్‌లో ఉన్నా, డ్రైవర్ వెనుక విండోను ఎలక్ట్రానిక్‌గా ఆపరేట్ చేయగలడు.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

ఈ సాఫ్ట్ టాప్ పైకి ఉన్నప్పుడు అది విండ్‌షీల్డ్ మాదిరిగా పనిచేస్తుంది మరియు ఈ కారులోని వి10 ఇంజన్ యొక్క ప్రత్యేకమైన ధ్వనిని పెంచుతుంది. వేరు చేయగలిగిన రెండు పార్శ్వ విండ్‌షీల్డ్‌లు క్యాబిన్‌లో ఏరోడైనమిక్ శబ్దాన్ని తగ్గిస్తాయి, తద్వారా ప్రయాణీకులు అధిక వేగంతో వెళ్తున్నప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడుకోవటానికి వీలు ఉంటుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో హెచ్ఎమ్ఐ 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది, ఇది టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి సమగ్ర కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

ఇంజన్ పరంగా చూసుకుంటే, ఈ సూపర్ కారులో శక్తివంతమైన 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ వి10 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ఠ వేగాన్ని యాంత్రికంగా గంటకు 324 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

లాంబోర్ఘినీ హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యూడి స్పైడర్ డ్రైవర్ నైపుణ్యాలపై దృష్టి సారించే అగ్ర పనితీరును నిర్ధారిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన పి-టిసిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్ని పరిస్థితులలోనూ అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.

భారత్‌లో లాంచ్ కానున్న లాంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌: డీటేల్స్

అలాగే, ఈ సూపర్ కార్ యొక్క అల్యూమినియం మరియు థర్మోప్లాస్టిక్ రెసిన్ బాడీని అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్‌తో నిర్మించిన తేలికపాటి హైబ్రిడ్ చాస్సిస్‌పై అమర్చబడి ఉంటుంది. ఈ కారు మొత్తం బరువు 1,509 కిలోలుగా ఉంటుంది మరియు దీని పవర్ టూ వెయిట్ రేషియో 2.47 కిలోలు / హెచ్‌పిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Lamborghini To Launch Huracan Evo RWD Spyder In India On 8th June 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X