ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ లాంబోర్ఘిని తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఉరుస్, ఇప్పుడు మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐస్‌పై అత్యధిక వేగంతో పరుగులు తీసి, కొత్త టాప్-స్పీడ్ రికార్డ్ సృష్టించింది.

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

లాంబోర్ఘిని యొక్క సూపర్ ఎస్‌యూవీ 'ఉరుస్' రష్యాలో గడ్డకట్టిన బైకాల్ సరస్సుపై నిర్వహించిన డేస్ ఆఫ్ స్పీడ్‌లో భాగంగా రికార్డు సృష్టించింది. ఈ కారును ఐస్‌పై గరిష్టంగా గంటకు 298 కిలోమీటర్ల వేగంతో నడిపిన రష్యన్ డ్రైవర్ మరియు డేస్ ఆఫ్ స్పీడ్ యొక్క 18 సార్లు రికార్డ్ హోల్డర్ అయిన ఆండ్రీ లియోన్టీవ్ ఈ రికార్డును సాధించారు.

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

ఈ రికార్డును రష్యన్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (ఆర్ఏఎఫ్) గుర్తించింది. ఈ రికార్డును సాధించిన ఆండ్రీ లియోన్టీవ్ వ్యాఖ్యానిస్తూ, మంచుతో గడ్డకట్టిన బైకాల్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు, ఇది సరైన ట్రాక్ అని తాను వెంటనే గ్రహించాని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులు తారు రోడ్లు మరియు ఉప్పు సరస్సులపై రికార్డులు సృష్టిస్తున్నారని, అయితే వారికి భిన్నంగా తాను గడ్డకట్టిన సరస్సుపై రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాని తెలిపారు.

MOST READ:'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

రష్యాలో మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఫలితంగా దాదాపు అన్ని సరస్సులు కొన్ని నెలల పాటుగా పూర్తిగా మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటాయి. అందుకే తాను గడ్డకట్టిన బైకాల్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు ఆండ్రీ చెప్పారు. మొదట తన స్నేహితులతో వచ్చి ఈ సరస్సుపై రేస్ చేసే వాడినని, ఇప్పుడు ఈ రికార్డు కోసం ఎఫ్ఐఏని సంప్రదించామని ఆయన తెలిపారు.

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

నిజానికి తారు రోడ్లు లేదా సాల్ట్ లేక్‌లపై డ్రైవింగ్‌తో పోల్చుకుంటే ఈ గడ్డ కట్టిన సరస్సుపై డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఇందుకోసం సరస్సులోని ఐస్ యొక్క మందాన్ని అంచనా వేయటం ఎంతో అవసరం. అంతేకాకుండా, ఐస్‌పై టైర్ల ట్రాక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఏదైనా తప్పుడు తీర్పు తీసుకున్నా లేదా తప్పుడు లెక్కలు వేసినా ప్రాణాలకే ప్రమాదం.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఇక లాంబోర్ఘిని ఉరుసు సూపర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ శక్తివంతమైన కారులో 650 హెచ్‌పి 4.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కారణంగానే ఇది బైకాల్ సరస్సు యొక్క ఉపరితలంపై మంచి ట్రాక్షన్ అందించగలిగింది.

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

లాంబోర్ఘిని ఉరుస్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు 12.8 సెకన్ల వ్యవధిలో గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు. ఈ రేస్ విషయంలో రష్యన్ డ్రైవర్ ఆండ్రీ, లంబోర్ఘిని ఉరుస్ యొక్క హ్యాండ్లింగ్ సామర్థ్యాలను మరియు ఫ్లెక్సిబిలిటీని ప్రశంసించాడు.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఐస్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసి సరికొత్త రికార్డ్ సృష్టించిన లాంబోర్ఘిని ఉరుస్!

రష్యాలోని బైకాల్ సరస్సు ప్రపంచంలో లోతైన మంచినీటి సరస్సు. రష్యాలోని దక్షిణ సైబీరియన్ ప్రాంతంలో ఉన్న ఈ సరస్సు మొత్తం బెల్జియం దేశం కంటే పెద్దదిగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఫలితంగా, శీతాకాలంలో ఈ నది పూర్తిగా మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటుంది.

Most Read Articles

English summary
Lamborghini Urus Sets New Top Record For On Ice At World’s Largest Freshwater Lake. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X