ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న డిఫెండర్ ఎస్‌యూవీ దాని అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్ధ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ప్రపంచంలోని చాలా మంది సాహస పర్యాటకులు ట్రెక్కింగ్‌కు వెళ్లడానికి డిఫెండర్ ఎస్‌యూవీని ఉపయోగించటానికి ఇదే కారణం.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

అంతటి ప్రాచుర్యం పొందిన ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఇప్పుడు ప్రపంచంలోనే కష్టతరమైన అడ్వెంచర్ రేసులో పాల్గొనబోతోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రెడ్ బుల్ ఎక్స్-ఆల్ప్స్ రేసులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

డిఫెండర్ 110 ఎస్‌యూవీల సముదాయం 1,238 కిలోమీటర్ల మేర ఉన్న చెట్ల భూభాగంలో అథ్లెట్లు, వైద్య సిబ్బంది మరియు సహాయక సిబ్బందిని తీసుకువెళుతుంది. రెడ్ బుల్ ఎక్స్-ఆల్ప్స్‌ను ప్రపంచంలోనే కష్టతరమైన అడ్వెంచర్ రేసు అని పిలుస్తారు, ఎందుకంటే ఇందులో పాల్గొనేవారు రోజులో 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది మరియు ఇందులో 5 కిలోమీటర్ల నిటారుగా డ్రైవ్ చేయటం ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

ఇది మాత్రమే కాదు, ఈ మార్గం అడవులు, పర్వతాలు మరియు ప్రవేశించలేని ప్రాంతాల గుండా వెళుతుంది, ఇక్కడ హోటల్, రెస్టారెంట్ లేదా ఇళ్ల వంటి సౌకర్యాలు అస్సలే ఉండవు. రేసులో ఉన్న అథ్లెట్లు తమ వసతి మరియు ఆహారం కోసం వారి స్వంత ఏర్పాట్లు వారే చేసుకోవాలి.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

ఈ ప్రదేశాలకు వెళ్లడానికి ఉత్తమమైన ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీని ఉపయోగిస్తారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఈ రేసులో అథ్లెట్లను తీసుకువెళ్ళే ఉత్తమ ఎస్‌యూవీగా పరిగణించబడింది. అథ్లెట్లను మోయడంతో పాటు, ఎస్‌యూవీలో కీలకమైన పరికరాలు, సాధనాలు కూడా ఉంటాయి.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

ఈ రేసులో ఉపయోగించిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడళ్లలో ఆటోహోమ్ ప్యాక్ వ్యవస్థాపించబడింది. ఈ ఆటోహోమ్ ప్యాక్ కారు పైకప్పుపై అమర్చబడి ఉంటుంది, ఇది చిన్నపాటి టెంట్‌లో తెరచుకుంటుంది. ఈ టెంట్ రాత్రి వేళల్లో సేద తీరడానికి చాలా సురక్షితమైన స్థలాన్ని అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

అథ్లెట్లు మరియు సిబ్బంది ఈ రేసులో పాల్గొన్నప్పుడు రాత్రి వేళ్లలో, కారు పైకప్పుపై ఉన్న ఈ టెంట్‌లో (ఆటోహోమ్‌లో) గడుపుతారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ యొక్క సామర్థ్యాలు రేసులో కఠినంగా పరీక్షించబడతాయి.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 గరిష్టంగా 900 కిలోల బరువును మోయగలదు మరియు 160 కిలోల బరువును కారు పైకప్పుపై ఉంచవచ్చు. ఈ రేసులో పాల్గొనే ప్రతి వాహనం కూడా క్యాంపింగ్ పరికరాలు మరియు సామాగ్రితో లోడ్ చేయబడి ఉంటాయి.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

ల్యాండ్ రోవర్ డిఫెంజర్ కారులో అనేక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ కొలైజన్ మోనిటర్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, డ్రైవర్ కండిషన్ మోనిటర్ మరియు 360-డిగ్రీ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, మూడు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

కొత్త 2021 మోడల్ ల్యాండర్ రోవర్ డిఫెండర్ డీజిల్ వెర్షన్లు 3.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-4 ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 300 పిఎస్ పవర్‌ను మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్వెంచర్ రేసులోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ కేవలం 7 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 191 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇవి టెర్రైన్ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Land Rover Defender 110 To participate In world’s Toughest Red Bull X Alps Adventure race. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X