జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover V8 Bond Edition ఇదే.. చూసారా!!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన Land Rover (ల్యాండ్ రోవర్) తన పవర్ ఫుల్ Land Rover Defender (ల్యాండ్ రోవర్ డిఫెండర్) యొక్క కొత్త V8 Bond Edition (వి8 బాండ్ ఎడిషన్‌) వెల్లడించింది. ఈ కొత్త V8 Bond Edition SUV త్వరలో రాబోయే 25 వ జేమ్స్ బాండ్ మూవీ 'No Time To Die' (నో టైమ్ టు డై) లో కనిపించనుంది. అయితే ఈ SUV ని కంపెనీ 2021 సెప్టెంబర్ 30 న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

Land Rover నుంచి రానున్న ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఈ కొత్త SUV ప్రపంచవ్యాప్తంగా 300 యూనిట్లు మాత్రమే ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇందులో 3 డోర్స్ మరియు 5 డోర్స్ అనే రెండు వేరియంట్స్ ఉంటాయి. ఇందులో డిఫెండర్ 90 (3 డోర్స్) మరియు డిఫెండర్ 110 (5 డోర్స్) అందుబాటులో ఉంటాయి.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ జేమ్స్ బాండ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఈ ఎడిషన్ డిఫెండర్ వి8 పై ఆధారపడి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా నిగనిగలాడే బ్లాక్ పెయింట్ లో అద్భుతంగా ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ లో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లు మరియు వెనుక భాగంలో 'డిఫెండర్ 007' బ్యాడ్జింగ్ లభిస్తుంది.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

Land Rover Defender V8 Bond Edition యొక్క క్యాబిన్‌ అద్భుతంగా ఉంటుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బూట్ చేసినప్పుడు ఇన్స్క్రిప్షన్ మరియు యానిమేషన్‌గా కనిపిస్తుంది. దీనితో పాటు ప్రకాశవంతమైన కాబ్ ప్లేట్లపై 'డిఫెండర్ 007' బ్యాడ్జింగ్ ఉంటుంది. ఈ SUV లో గమనించినట్లతే 'SV బెస్‌పోక్' లోగో దాని కింద 'వన్ అఫ్ 300' చూడవచ్చు.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

కొత్త V8 Bond Edition యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 5-లీటర్ సూపర్ ఛార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 525 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కొత్త ఎడిషన్ యొక్క గరిష్ట వేగం 240 కి.మీ.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

ఇండియన్ మార్కెట్లో ఉన్న డిఫెండర్ విషాయానికి వస్తే, ఇవి 300-బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 400 బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే 3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 300 బిహెచ్‌పిలను ఉత్పత్తి చేసే 3-లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

అంతే కాకుండా ఇవన్నీ కూడా మంచి ఆఫ్ రోడింగ్ సెంట్రిక్ టెక్నాలజీతో ఉంటాయి. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి ట్విన్-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ గేర్‌బాక్స్, యాక్టివ్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ మరియు మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను పొందుతుంది.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 76.57 లక్షల నుండి రూ .1.12 కోట్ల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఇండియా). V8 డిఫెండర్ భారతదేశంలో అందుబాటులో లేదు, కావున Land Rover Defender V8 Bond Edition భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం లేదు. అయితే ఈ SUV మాత్రం చాలా అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

జేమ్స్ బాండ్ సినిమాలో కనిపించనున్న Land Rover కార్ ఇదే.. చూసారా!!

అదే విధంగా "నో టైమ్ టు డై' చిత్రం విషయానికి వస్తే, ఇది 'క్యారీ జోజి ఫుకునాగా' దర్శకత్వంలో రానుంది. ఈ మూవీలో డేనియల్ క్రెయిగ్ నటించారు. ఈ చిత్రం 2021 సెప్టెంబర్ 30 నుండి UK లో యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ లో మరియు US అక్టోబర్ 8 2021 న, మెట్రో గోల్డ్‌విన్ మేయర్ (MGM) వారి యునైటెడ్ ఆర్టిస్ట్స్ లాంచ్ బ్యానర్ ద్వారా విడుదల కానుంది.

ల్యాండ్ రోవర్ యొక్క ఆఫ్ రోడర్ SUV లు భరతదేశంలో కూడా బాగా ప్రచ్చుర్యం పొందాయి. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే చాలా మోడల్స్ విడుదల చేసింది. ఎక్కువమంది సినీ తారలు, క్రికెటర్లు మరియు పారిశ్రామికవేత్తలు ఈ SUV లను కొనుగోలు చేస్తుంటారు.

Most Read Articles

English summary
Land rover defender v8 james bond edition revealed features engine details
Story first published: Saturday, September 4, 2021, 13:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X