భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, తన ప్రముఖ ఎస్‌యువి అయిన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్‌'ను కొత్త వి8 ఇంజిన్‌తో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ల్యాండ్ రోవర్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త డిఫెండర్ వి8 ప్రారంభ ధర అక్షరాలా 1.90 కోట్ల రూపాయలు.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ వి8 ఎస్‌యువి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

భారత మార్కెట్లో విడుదలైన కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ వి8 ఎస్‌యువి ధర దీని ప్రత్యర్థి అయిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 ధరకంటే కూడా చాలా తక్కువ. దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం 2.44 కోట్ల రూపాయలు.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 ఎస్‌యువిలోని అద్భుతమైన ఫీచర్, ఇందులో ఉన్న ఇంజిన్. ఇది 5.0 లీటర్ వి8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 525 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఇందులో 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా అందించింది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 లో చాలా శక్తివంతమైన ఇంజిన్ ఉపయోగించబడింది, అయితే ఈ కొత్త ఎస్‌యువి పనితీరు అంత ఆకట్టుకునేలా కనిపించడం లేదు. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 యొక్క గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 లో కంపెనీ గట్టి సస్పెన్షన్ మరియు 22-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉపయోగించింది. ఈ కారులో వి8 ఇంజిన్ కోసం కంపెనీ ప్రత్యేకంగా కొత్త 'డైనమిక్' డ్రైవింగ్ మోడ్‌ని ప్రవేశపెట్టింది, ఇది గరిష్ట పనితీరును అందించడంలో సహాయపడుతుంది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 లోపలి భాగం సాధారణ డిఫెండర్ మోడల్స్ కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. దీని లోపలి భాగం పూర్తిగా నలుపు రంగులో అలంకరించబడింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 ఒక స్పోర్ట్స్ ప్రొడక్ట్ లా కనిపించేలా చేయడానికి ఈ డెకరేషన్ సహాయపడుతుంది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8, క్వాడ్ ఎగ్జాస్ట్ మరియు జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌ల వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8 భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇది లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8 మరియు బీఎండబ్ల్యూ ఎక్స్5ఎమ్ వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

ల్యాండ్ రోవర్ కంపేనీ ఇటీవల దేశీయ మార్కెట్లో తన కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ధర రూ.88.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ 2021 ఎడిషన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీలో కంపెనీ అనేక అప్‌గ్రేడ్స్ చేసింది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీ అనేక అధునాత ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉటుంది. 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ పి300 వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 296 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8; సూపర్ ఫీచర్స్ & సూపర్ పవర్

దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన ల్యాండ్ రోవర్ కార్లు సెలబ్రెటీలు మొదలైన వారు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి మంచి ఆఫ్ రోడర్లుగా కూడా పనిచేస్తాయి. అంటే ఇవి ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ల్యాండ్ రోవర్ కార్లు పరిమాణం పరంగా కూడా ఇతర ఎస్‌యూవీలకంటే కూడా భిన్నంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Land rover defender v8 launched in india at rs 1 90 crore details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X