విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న డిస్కవరీ మోడల్‌లో ఓ సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించిన వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ల్యాండ్ రోవర్ అఫీషియల్ ఇండియన్ వెబ్‌సైట్‌లో డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లిస్ట్ చేశారు. రాబోయే నెలల్లో ఇది భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. నిజానికి గడచిన నవంబర్ 2020 నెలలోనే ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

భారతదేశంలో కొత్త 2020 మోడల్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ మొత్తం నాలుగు వేరియంట్లు మరియు రెండు ఇంజన్ ఆప్షన్లలో విడుదల కానుంది. ఈ హై-ఎండ్ లగ్జరీ ఎస్‌యూవీని స్టాండర్డ్, ఎస్, ఎస్‌ఈ మరియు హెచ్‌ఎస్‌ఈ అనే నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టనున్నారు.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఈ ఎస్‌యూవీలో ఆర్ డైనమిక్ ట్రిమ్ కూడా లభిస్తుందని సమాచారం. కాకపోతే, ఇది టాప్-ఎండ్ ఎస్, ఎస్‌ఈ మరియు హెచ్‌ఎస్‌ఈ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇందులో అనేక కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో రానుంది. అంతేకాకుండా, ఇది లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోని డేటైమ్ రన్నింగ్ లైట్లను U ఆకారంలో డిజైన్ చేశారు. రీడిజైన్ చేయబడిన పెద్ద హనీకోంబ్ గ్రిల్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ కారులో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్, ఫ్రంట్ అండ్ రియర్ ఇండికేటర్స్ మరియు కొత్త గ్రిల్ ఉన్నాయి. ఇవే కాకుండా, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను కూడా రీడిజైన్ చేశారు.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో హోండా కంపెనీ విక్రయించిన కార్లు; పూర్తి వివరాలు

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఈ కారు సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఇది ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో కొత్తగా 20 ఇంచ్, 21 ఇంచ్ మరియు 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని వెనుక భాగాన్ని కూడా రీడిజైన్ చేశారు. ఇందులో నెంబర్ ప్లేట్ పైభాగంలో పియానో బ్లాక్ ఫినిషింగ్ మరియు దానిపై డిస్కవరీ బ్యాడ్జింగ్ ఉంటుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని డాష్‌బోర్డ్ ఓవరాల్ లేవుట్ మాత్రం ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, కంపెనీ ఇందులో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసింది. కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఇప్పుడు అనేక కొత్త టెక్నాలజీ ఫీచర్లతో లభ్యం కానుంది.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఇందులోని కొత్త స్టీరింగ్ వీల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్ నుండి గ్రహించినట్లుగా అనిపిస్తుంది. ఇందులోని రోటరీ నాబ్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో డయల్‌ను డిజిటల్‌గా ఉంచారు, ఇది ఆధునిక రూపాన్ని ఇస్తుంది. ఇంకా ఉందులో జెఎల్ఆర్ యొక్క 11.4ఇంచ్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించనున్నారు. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 300 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 360 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

విడుదలకు సిద్ధమవుతున్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్; వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

అలాగే, ఇందులోని 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 300 బిహెచ్‌పి పవర్‌ను మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని అన్ని ఇంజన్లకు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ కారులో చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని ధర కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Land Rover Discovery Facelift Listed In Company's Website, Launch Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X