ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ విక్రయిస్తున్న 'డిఫెండర్' ఎస్‌యూవీ, భారత్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం ఆఫ్-రోడ్ లగ్జరీ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త పికప్ ట్రక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

ప్రస్తుతం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 3-డోర్ (90) మరియు 5-డోర్ (110) బాడీ స్టైల్స్‌లో లభిస్తోంది. బాక్సీ టైప్ డిజైన్ కలిగిన ఈ ఎస్‌యూవీ అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. వాస్తవానికి డిఫెండర్ పికప్ ట్రక్ కొత్తేమీ కాదు, గతంలో పాత వెర్షన్ డిఫెండర్ ఆధారంగా కంపెనీ ఓ పికప్ మోడల్‌ను కూడా విక్రయించింది.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

అయితే, కొత్త డిఫెండర్ మోడల్‌ను మాత్రం కేవలం ఎస్‌యూవీ రూపంలోనే విక్రయిస్తున్నారు. ఈ మోడల్‌లో పికప్ ట్రక్ రాదని అందరూ భావించారు. కానీ, డిఫెండర్ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తున్న నిక్ కోలిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిఫెండర్ పికప్ ట్రక్ రావచ్చని ఆయన సూచన ప్రాయంగా తెలియజేశారు.

MOST READ:ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ విడుదల చేసిన నితిన్ గడ్కరీ, ఏం చెప్పారో తెలుసా..!

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

కొత్త డిఫెండర్ యొక్క విశిష్టమైన బాడీ ప్లాట్‌ఫామ్ కారణంగా, నిర్మాణ పరంగా ఇది (ల్యాండర్ రోవర్ డిఫెండర్ పికప్ ట్రక్) సాధ్యం కావచ్చు మరియు ఈ విభాగానికి డిమాండ్ కూడా ఉందని కోలిన్స్ అన్నారు. ఈ మోడల్ విషయంలో భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఆయన చెప్పారు.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

కొత్త తరం ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మిస్తున్నారు. ఈ ఛాస్సిస్‌కు ఎస్‌యూవీ నుండి పికప్ ట్రక్ రూపం ఇవ్వటం కంపెనీకి పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇదే విషయాన్ని నిక్ కోలిన్స్ ప్రస్తావించారు. ఒకవేళ భవిష్యత్తులో డిఫెండర్ పికప్ ట్రక్ వాస్తవ రూపం దాల్చితే, ఆ మోడల్‌కి మంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది.

MOST READ:పాస్టాగ్ లొల్లి షురూ.. ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకి రూ.310 టోల్ చార్జ్!

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

గతంలో ల్యాండ్ రోవర్ ఆఫర్ చేసిన పాత తరం డిఫెండర్ పికప్ మోడల్‌ను ఎలా కావాలనుకుంటే అలా మార్చుకునే వీలుండేది. అప్పటి డిఫెండర్ పికప్ మోడల్‌ను తొలగించుకోవటానికి వీలుగా ఉండే హార్డ్ టాప్ లేదా ఫోల్డ్ చేసుకోవటానికి వీలుగా ఉండే కాన్వాస్ సాఫ్ట్ టాప్ లేదా అసలు పూర్తిగా టాప్ లేకుండా ఉండేలా డిజైన్ చేశారు.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

డిఫెండర్ పిక్-అప్ మోడల్‌ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న 5-డోర్ 110 మోడల్ ఆధారంగా తయారు చేసే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రావచ్చని అంచనా. మరోవైపు ఇందులో ప్లగ్-ఇన్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ పిక్-అప్ ట్రక్, దాని విశిష్టమైన స్టైలింగ్ మరియు విలక్షణమైన ఫీచర్ల కారణంగా, స్టాండర్డ్ డిఫెండర్ కంటే అధిక ధరను కలిగి ఉండొచ్చని అంచనా.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

ప్రస్తుతం భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు రూ.73.98 లక్షల నుండి రూ.1.08 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉన్నాయి. ఇందులో 300 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. త్వరలోనే ఇందులో డీజిల్ ఇంజన్ వేరియంట్ కూడా రావచ్చని తెలుస్తోంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

ఇదిలా ఉంటే, ల్యాండ్ రోవర్ ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త 2020 డిఫెండర్ పి400ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, ఏప్రిల్ 2021లో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో దీని కోటి రూపాయల పైగానే ఉండొచ్చని అంచనా.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి డిఫెండర్ పికప్ ట్రక్ రానుందా?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ పి400ఇ మోడల్‌ను డిఫెండర్ 110 (5-డోర్ వెర్షన్) వేరియంట్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే 300 బిహెచ్‌పి శక్తి అదనంగా 40 బిహెచ్‌పి శక్తిని ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా జనరేట్ చేస్తుంది. ఒక్క ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారు పూర్తిగా 43 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Land Rover Might Launch A Pickup Variant Of Defender SUV, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X