Just In
- 8 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో రూ. 2.22 కోట్ల న్యూ లెక్సస్ ఎల్ఎస్500 నిషిజిన్ లాంచ్ : పూర్తి వివరాలు
భారత మార్కెట్లో లెక్సస్ ఎల్ఎస్ 500 హెచ్ లగ్జరీ కారు యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్ విడుదల చేయబడింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లెక్సస్ ఎల్ఎస్ 500 హెచ్ నిషిజిన్ అనే పేరుతో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎల్‌ఎస్ 500 నిషిజిన్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.22 కోట్లు (ఎక్స్-షోరూమ్,ఇండియా).

కొత్త ఎల్‌ఎస్ 500 నిషిజిన్ లోపల మరియు వెలుపల అనే కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారు యొక్క వెలుపలభాగంలో ఇప్పుడు ‘జిన్-ఐ-లస్టర్' అని పిలువబడే సరికొత్త ఎక్సటీరియర్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. ఈ పెయింట్ స్కీమ్ అద్దం లాంటి ఆకృతిని అందిస్తుందని లెక్సస్ పేర్కొంది.

కొత్త లెక్సస్ ఎల్ఎస్ 500 సెడాన్ కొత్త పెయింట్ స్కీమ్ తో పాటు స్పోర్టియర్ మరియు దూకుడుగా ఉండే బంపర్‌తో అప్‌డేట్ చేయబడింది. ఇది చూడటానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఇక ఈ కొత్త లెక్సస్ ఎల్ఎస్ 500 నిషిజిన్ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇవి ట్రెడిషనల్ జపనీస్ క్రాఫ్ట్ తో చాలా మోడ్రన్ టెక్నాజీతో వస్తుంది. కొత్త వేరియంట్‌లోని క్యాబిన్ అద్భుతమైన స్టైల్ మరియు సౌకర్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త ఎల్ఎస్ 500 వేరియంట్ యొక్క కలర్, పౌర్ణమికి ముందు సముద్రంలోని చంద్రకాంతి నుండి ప్రేరణ పొందింది. దీనికి అనుగుణంగానే కొత్త ఎల్ఎస్ 500 వేరియంట్ యొక్క ఇంటీరియర్‌లు సన్నని ‘హకు' ప్లాటినం రేకుతో పాటు ‘నిషిజిన్' యొక్క సిల్వర్ త్రెడ్ తో వస్తుంది.
MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఇది మాత్రమే కాకుండా కాకుండా, లెక్సస్ ఎల్ఎస్ 500 యొక్క స్టాండర్డ్ మరియు నిషిజిన్ రెండు వేరియంట్లు కూడా అప్డేట్ చేయబడి ఉంటాయి. ఈ కారులో ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి సెడాన్ యొక్క 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో డిస్ప్లే మరియు ఆడియో ఫంక్షన్‌లను ఆపరేటింగ్ చేయవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు.

లెక్సస్ యొక్క ఎల్ఎస్500 వేరియంట్లలో స్టీరింగ్ మరియు సెంటర్ కన్సోల్‌లోని స్విచ్‌లు మరియు ఫిజికల్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ బాగా అప్డేట్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ సెడాన్ యొక్క ఇంటీరియర్‌లు మరింత ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని ఇస్తాయి.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

కొత్త లెక్సస్ ఎల్ఎస్ 500 నిషిజిన్, దాని స్టాండర్డ్ మోడల్ లాగా అదే పవర్‌ట్రెయిన్ ద్వారా శక్తిని పొందుతోంది. ఇది 3.5-లీటర్ వి 6 పెట్రోల్ ఇంజన్ రూపంలో 354 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జత చేయబడింది.

నిషిజిన్ అని పిలువబడే లెక్సస్ ఎల్ఎస్ 500 యొక్క కొత్త వేరియంట్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ప్రధాన సెడాన్ సమర్పణ యొక్క కొత్త శ్రేణి-టాపింగ్ ట్రిమ్. ఈ సెడాన్ భారత మార్కెట్లో ఆడి ఎ 8 ఎల్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే