విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

భారతదేశంలో వాహన తయారీదారులందరూ దాదాపుగా తమ కంపెనీ యొక్క 2021 ఏప్రిల్ అమ్మకాలు యొక్క నివేదికను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశీయ ఆటో మొబైల్ సంస్థ అయిన మహీంద్రా & మహీంద్రా కంపెనీ 2021 ఏప్రిల్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. మహీంద్రా యొక్క 2021 ఏప్రిల్ అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో 36,437 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ వాహనాల్లో ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్స్ మరియు వ్యవసాయానికి ఉపయోగపడే వాహనాలు ఉన్నాయి.

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

2021 మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే కంపెనీ అమ్మకాలలో ప్రస్తుతం 9.5 శాతం పెరిగాయి. అంటే దీని ప్రకారం కంపెనీ గత నెలలో 18,186 యూనిట్ల యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కార్ల అమ్మకాలు విషయానికి వస్తే, 99 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించినట్లు తెలిసింది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మహీంద్రా కంపెనీ యొక్క 2 టన్నుల నుంచి 3.5 టన్నుల బరువు గల కమర్షియల్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, ఈ కేటగిరిలో మొత్తం 12,210 యూనిట్లను విక్రయించి, సబ్ 2 టి రంగంలో 1,561 యూనిట్లు అమ్మకాలు జరిపింది. అయితే ఈ విభాగంలో మహీంద్రా బొలెరో ముందంజలో ఉంది.

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

కంపెనీ 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువు గల భారీ వాణిజ్య వాహనాలను 333 యూనిట్లు విక్రయించింది. అదే సమయంలో, 3-వీలర్ విభాగంలో 2,043 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వచ్చినట్లైతే, ఈ విభాగంలో అమ్మకాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో మెరుగ్గా ఉన్నాయి.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మహీంద్రా ఈ విభాగంలో గత నెలలో 2,005 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 174 శాతం పెరిగింది. మహీంద్రా వ్యవసాయ పరికరాల విషయానికి వస్తే, ప్రస్తుత అమ్మకాలు గతనెల అమ్మకాలకేనట కొంత మెరుగ్గా అనిపిస్తున్నాయి.

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది ఇదే నెలలో 4,716 యూనిట్లను విక్రయించగా, కంపెనీ గత నెలలో 26,130 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో, 2020 ఏప్రిల్ నాటికి కంపెనీ 1,393 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది.

MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

ఏప్రిల్ 2021 అమ్మకాల గురించి మహీంద్రా & మహీంద్రా యొక్క ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ వీజయ్ నక్రా మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీకి బలమైన డిమాండ్ ఉంది. కానీ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న కారణంగా సరఫరా మరియు ఉత్పత్తి చాలా నెమ్మదిగా జరుగుతోంది.

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మహీంద్రా కంపెనీ తన వినియోగదారుల ఉపయోగార్థం డిజిటల్ మరియు కాంటాక్ట్ లెస్ సేల్స్ మరియు సర్వీస్ అసిస్ట్ వంటివి అందిస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రబలుతున్న మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కాంటాక్ట్ లెస్ సేల్స్ ఇపుడు చాలా అవసరం కావున ఇవన్నీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

MOST READ:పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

దేశీయ మార్కెట్లో మహీంద్రా వాహనాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. గత సంవత్సరం భారత మార్కెట్లో విడుదలైన మహీంద్రా కంపెనీ యొక్క థార్ అత్యధిక అమ్మకాలను చవిచూస్తోంది. అంతే కాకుండా ఈ థార్ ఇప్పటికే ఎక్కువ బుకింగ్స్ కూడా పొందింది. కావున ఇప్పుడు దీని డెలివరీ కూడా చాల రోజులు పెట్టె అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra & Mahindra April 2021 Sales. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X