మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

స్వదేశీ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో తన పోర్ట్‌ఫోలియోలో వాహనాల ధరలను పెంచినాట్లు ప్రకటించింది. ధరలు పెంచినప్పటికీ, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ తన కార్లపై కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న ఆఫర్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో మొదట మహీంద్రా ఎక్స్‌యూవీ 300 విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ యొక్క పెట్రోల్ మోడల్‌పై రూ. 5000 మరియు, డీజిల్ మోడల్‌పై రూ. 10,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. కేవలం ఇది మాత్రమే కాకుండా రూ. 25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,500 కార్పొరేట్ రిబేటు మరియు రూ. 5 వేల వరకు ఫ్రీ యాక్ససరీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది.

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

మహీంద్రా బొలెరో విషయానికి వస్తే, ఈ కారుపై 3,500 రూపాయల నగదు తగ్గింపు, దీనితో పాటు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంతే కాకుండా నాలుగు సంవత్సరాల ఫ్రీ ఎక్స్ట్రా వారంటీ కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

మహీంద్రా కంపెనీ తన మరాజొ ఎం 2 వేరియంట్‌పై 20,000 రూపాయల నగదు తగ్గింపు లభిస్తుండగా, ఎం 4, ఎం 6 వేరియంట్‌లకు రూ. 15 వేల నగదు తగ్గింపు లభిస్తోంది. దీనితో పాటు ఈ కారుపై రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 6 వేల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.

Mahindra Model Cash Discount Exchange Bonus + Corporate Discount + Additional Benefits
XUV300 (Petrol) Up to ₹5,000 ₹25,000 + ₹4,500 (+ free accessories worth ₹5,000)
XUV300 (Diesel) Up to ₹10,000 ₹25,000 + ₹4,500 (+ free accessories worth ₹5,000)
Bolero ₹3,500 ₹10,000 + ₹4,000 (+ additional warranty for 4th year)
Thar - -
Marazzo Up to ₹20,000 ₹15,000 + ₹6,000
Scorpio Up to ₹7,042 ₹15,000 + ₹4,500 (+ free accessories worth ₹10,000)
XUV500 ₹36,800 ₹20,000 + ₹9,000 (+ free accessories worth ₹15,000)
Alturas G4 Benefits of up to ₹3 lakh on remaining stock
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

మహీంద్రా స్కార్పియోపై రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,500 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఫ్రీ యాక్ససరీస్ లభిస్తాయి. అంతే కాకుండా రూ. 7,042 వరకు నగదు తగ్గింపును స్కార్పియోపై డిస్కౌంట్ లభిస్తుంది.

MOST READ:భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

మహీంద్రా ఎక్స్‌యువి 500 విషయానికి వస్తే, కంపెనీ ఈ కారుపై రూ. 36,800 వరకు నగదు తగ్గింపు, రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .9 వేల కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 15 వేల ఫ్రీ యాక్ససరీస్ ఇస్తున్నారు.

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

చివరగా, మహీంద్రా యొక్క ఫుల్ సైజ్ ఎస్‌యూవీ, మహీంద్రా అల్టురాస్ జి 4 విషయానికి వస్తే, ఈ కారుపై కొత్త కస్టమర్లకు రూ. 3 లక్షల వరకు లాభం చేకూరుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుత అల్టురాస్ స్టాక్ ముగింపు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే వివిధ డీలర్‌షిప్‌లో ఈ ఆఫర్‌లు భిన్నంగా ఉండవచ్చు.

MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

ఇది ఇలా ఉండగా ఇప్పుడు కంపెనీ యొక్క కొత్త మహీంద్రా థార్‌పై ఎటువంటి ఆఫర్లు లేదా నగదు తగ్గింపులను ఇవ్వడం లేదు. కొత్త తరం మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పుడు మహీంద్రా థార్ యొక్క వెయిటింగ్ పీరియడ్ సుమారు 10 నెలలు వరకు ఉంది. ఏది ఏమైనా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లు కొత్త కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మరియు అమ్మకాలు బాగా కొనసాగుతాయా అనే విషయాల కోసం కొంత కాలం వేచి చూడాలి.

Most Read Articles

English summary
Mahindra Cars Discount March 2021. Read in Telugu.
Story first published: Sunday, March 7, 2021, 6:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X