మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ బొలెరో పవర్ ప్లస్ మరియు స్కార్పియో ఎస్‌యూవీలపై అందించే వారంటీ ప్రోగ్రామ్‌ని అదనంగా మరో 2 సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో బొలెరో మరియు స్కార్పియో మోడళ్లు ముందంజలో ఉన్నాయి. తాజాగా, ఈ మోడళ్లపై వారంటీని పెంచిన తర్వాత, కస్టమర్‌లు ఇప్పుడు ఈ రెండు కార్లపై 7 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని పొందుతారు.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

కొత్త వారంటీ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏమిటి?

ఈ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ కింద, మహీంద్రా బొలెరో పవర్ ప్లస్‌కు 7 సంవత్సరాల లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకూ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందించడం జరుగుతుంది. అలాగే, మహీంద్రా స్కార్పియోపై 7 సంవత్సరాలు లేదా 1.70 లక్షల కిలోమీటర్ల వరకూ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని ఇవ్వబడుతుంది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

కవరేజ్ అప్రూవల్ మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి కంపెనీ వారంటీ (షీల్డ్) ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా, కస్టమర్లు ఇంజన్ పార్ట్స్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, ఫ్యూయల్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్‌లకు సంబంధించిన కవరేజ్ పొందుతారు.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

అధిక రీసేల్ వ్యాల్యూ

ఈ వాహనాలపై వారంటీని పొడగించడం వలన సౌకర్యవంతమైన యాజమాన్య బదిలీ మరియు సులభమైన ఈఎమ్ఐ సదుపాయంతో ఈ రెండు ఎస్‌యూవీలకు అధిక రీసేల్ వాల్యూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

సింపుల్‌గా చెప్పాలంటే, ఈ రెండు ఎస్‌యూవీలలో ఏదైనా ఒకదానిని కొనుగోలు చేసిన కస్టమర్లు, కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి 7 ఏళ్ల లోపే దీనిని ఎవరికైనా విక్రయించినట్లయితే, దానిపై ఉన్న వారంటీని కూడా కొత్త యజమానికి బదిలి చేయవచ్చు. ఈ వాహనాలపై వారంటీని పొడిగించడం ద్వారా, రాబోయే పండుగ నెలల్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ యోచిస్తోంది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

మహీంద్రా గతేడాది బొలెరో యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బొలెరో పవర్ ప్లస్ పేరుతో ప్రారంభించింది. మార్కెట్లో మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ ధరలు రూ.7.61 లక్షల నుండి రూ.9.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

ఇక మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే, ఈ రగ్గడ్ లుకింగ్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.2-లీటర్ 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 319 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

స్కార్పియోలో లభించే ప్రధాన ఫీచర్లను గమనించినట్లయితే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, పవర్ స్టీరింగ్ మరియు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా అభిమానులకు గుడ్ న్యూస్: బొలెరో, స్కార్పియో మోడళ్లపై 7 ఏళ్ల వారంటీ!

సేఫ్టీ విషయానికి వస్తే, మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో రెండు ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ధరలు రూ.12.59 లక్షల నుండి రూ.17.39 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra extends bolero power plus and scorpio warranty details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X