మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కార్లలో 'ఎక్స్‌యూవీ 700' కూడా ఒకటి. మహీంద్రా త్వరలోనే ఈ సరికొత్త ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ ఎక్స్‌యూవీ700 ఫీచర్లను ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

తాజాగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీకి సంబంధించిన స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ ఫీచర్‌ను కంపెనీ వెల్లడి చేసింది. టెస్లా వంటి అధునాతన ఎలక్ట్రిక్ కార్లలో కనిపించినట్లుగా, ఈ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కూడా కంపెనీ ఫ్లష్ టైప్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్‌ను ఆఫర్ చేయనుంది.

ఈ ఫ్లష్ టైప్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్‌ సాంప్రదాయ కార్లలో ఉబ్బెత్తుగా కనిపించే డోర్ హ్యాండిల్స్ మాదిరిగా కాకుండా, దాని బాడీలో కలిసిపోయినట్లుగా అనిపిస్తాయి. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఎక్స్‌యూవీ700 ఈ విభాగంలోనే ఈ తరహా ఫీచర్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి కారుగా కంపెనీ అభివర్ణించింది. ఆ టీజర్ వీడియోని మీరు కూడా చూసేయండి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

ఈ కొత్త ఎస్‌యూవీని అధికారికంగా మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, కంపెనీ ఇందులోని అనేక ఫీచర్లను వెల్లడిస్తూ వస్తోంది. స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ టెక్నాలజీకి ముందుగా మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700లో ఉన్న హై-స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, స్కైరూఫ్ ఫీచర్ మరియు ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడి చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్‌:

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో అందించబోయే స్పీడ్ అలర్ట్ సిస్టమ్, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్‌ను కలిగి ఉంటుంది. ఇది వాయిస్ కమాండ్ అలెర్ట్ రూపంలో ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని, నిర్దేశిత వేగం కన్నా అత్యధిక వేగంతో నడుపుతున్నట్లయితే, అది ఆటోమేటిక్‌గా గుర్తించి మీరు సెట్ చేసుకున్న మరియు మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో అలెర్ట్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద స్కైరూఫ్:

ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కంపెనీ సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్ ఫీచర్‌ను అందించనుంది. దీని పొడవు 1,360 మిమీ మరియు వెడల్పు 870 మిమీగా ఉంటుంది. ఈ కారులో ప్రయాణిస్తుంటే, ఓ కన్వర్టిబల్ కారులో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని మహీంద్రా పేర్కొంది. ఈ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ స్కైరూఫ్ పేరుతో పిలుస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్:

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ అనే ఫీచర్‌ను కూడా అందిస్తోంది. రాత్రి సమయంలో ఎక్స్‌యూవీ700లో గంటకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, కారు దానిని ఆటోమేటిక్‌గా గుర్తించి, అదనపు భద్రత కోసం రోడ్డుపై హెడ్‌లైట్ ప్రకాశించే కాంతిని ఆటోమేటిక్‌గా పెంచుతుంది. ఫలితంగా డ్రైవర్ విజిబిలిటీ మెరుగ్గా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

మహీంద్రాకు ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఈ ఏడాదిలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ఫీచర్లలో హ్యుందాయ్ అల్కాజార్ మరియు టాటా సఫారీ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది. కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని సరికొత్త డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కన్నా ఎక్స్‌యూవీ700 ఎక్కువ పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్‌లో 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్‌ను మరియు పెట్రోల్ వెర్షన్‌లో 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 'స్మార్ట్ డోర్ హ్యాండిల్' ఫీచర్: టీజర్ వీడియో

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఇది కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా అవతరిస్తుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్‌లతో వంటి మోడళ్లతో పోటీ పడనుంది. మహీంద్రా నుండి రానున్న ఈ కొత్త ఎస్‌యూవీలో లెవల్-1 అటానమస్ డ్రైవింగ్, మెర్సిడెస్ బెంజ్ ప్రేరేపిత డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఆల్-ఎల్‌ఈడి లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

Most Read Articles

English summary
Mahindra Reveals XUV700 Smart Door Handle Feature; Teaser Video Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X