భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా భారత సైన్యం ఓ బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ టెస్టింగ్ వాహనాన్ని కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా ఈ బుల్లెట్ ప్రూఫ్ స్కారియో చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

మహీంద్రా ఇప్పటికే భారత సైన్యం కోసం పలు రకాల ఆటోమొబైల్ వాహనాలను తయారు చేసింది. భారత సైన్యం కోసం రెగ్యులర్ ఆటోమొబైల్స్ సరఫరాదారులలో ఒకరైన మహీంద్రా, సైనిక వాహనాల శ్రేణిలో స్కార్పియో యొక్క కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది.

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

మహీంద్రా అందిస్తున్న 550 ఎక్స్‌డిబి జీప్, బొలెరో, రక్షక్ మరియు స్కార్పియో వంటి ప్రస్తుతం ఆర్మీతో పాటు దేశంలోని ఇతర రక్షణ బలగాలకు కూడా సేవలు అందిస్తున్నాయి. ఈ మహీంద్రా వాహనాలు భారత సైన్యానికి యుద్ధ సమయాల్లోనే కాకుండా సాధారణ శాంతియుత పరిస్థితులలో కూడా ఉపయోగపడతాయి.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

అయితే, మహీంద్రా తాజాగా పరీక్షిస్తోన్న స్కార్పియోపై భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లను ఉపయోగించడాన్ని ఈ చిత్రాల్లో గమనించవచ్చు. హర్యానా టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో టెస్ట్ చేస్తున్న ఈ వాహనం వెనుక భాగంలో ఆర్మీ ట్రైల్ అని కూడా రాసి ఉండటాన్ని ఈ స్పై చిత్రాలలో చూడొచ్చు.

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

మహీంద్రా రక్షక్ యొక్క వెనుక విండ్‌షీల్డ్ 10 మీటర్ల దూరం నుండి కాల్చిన 7.62 మిమీ బుల్లెట్లను సైతం తట్టుకోగలదు. అదే సమయంలో రక్షక్ గ్రెనేడ్లను కూడా తట్టుకోగలదు. ఈ మహీంద్రా వాహనంలో అందించే బుల్లెట్ ప్రూఫ్ ధృడమైన ఉక్కు, అల్లాయ్ స్టీల్ మరియు అధునాతన హై పెర్ఫార్మెన్స్ పాలిథిలిన్ మరియు అరామైడ్ లామినేట్లతో తయారు చేయబడింది.

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

కొత్త ఆర్మీ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో కూడా ఇదే తరహా బుల్లెట్ ప్రూఫ్ విధానం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ టెస్టింగ్ స్కార్పియో వెనుక భాగంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌కి ఇరువైపులా రెండు చిన్న రంధ్రాలను కూడా మనం గమనించవచ్చు.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

శత్రువులపై ప్రతిదాడి కోసం వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఆర్మీ వెర్షన్ మహీంద్రా స్కార్పియో ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం చూడటానికి స్టాక్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

ఆర్మీ కోసం మహీంద్రా ప్రస్తుతం తరం స్కార్పియోనే ఉపయోగించే అవకాశం ఉంది, ఇందులో కొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్ ఉండబోదని తెలుస్తోంది. అయితే, ఈ కారులో ఉపయోగించిన ఇంజన్‌ను మాత్రం మరింత శక్తిని ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

భారత సైన్యంలో చేరనున్న మహీంద్రా స్కార్పియో; రోడ్లపై బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ టెస్టింగ్!

కొత్త ఆర్మీ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో ఫైర్-సేఫ్ పెట్రోల్ ట్యాంక్ మరియు ఫ్లాట్ వీల్స్‌ను అందించవచ్చు. ప్రమాద సమయాల్లో ఇందులోని ఇంధన ట్యాంక్ పేలిపోకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అలాగే, టైర్లు పంక్చర్ కాకుండా ఉండేలా కుడా ప్రత్యేకమైన సెటప్ ఉంటుంది.

Source: Motoroctane

Most Read Articles

English summary
Mahindra Scorpio Bulletproof Version Spotted Testing For Indian Army, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X