ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. వార్షిక గణాంకాలతో పోల్చి చూస్తే, గడచిన ఫిబ్రవరి 2021లో అమ్మకాలలో కంపెనీ 43 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ సమయంలో మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ అమ్మకాలు కూడా చాలా బలంగా ఉన్నాయి.

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

కొత్త తరం మహీంద్రా స్కార్పియో విడుదల మరింత ఆలస్యం కావడంతో, కస్టమర్లు ప్రస్తుత తరం స్కార్పియోని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, గత నెలలో మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 3,532 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో స్కార్పియో గత నెలలో ఈ బ్రాండ్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్‌గా నిలిచింది.

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

ఫిబ్రవరి 2020లో మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 1,505 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంతో పోలిస్తే స్కార్పియో అమ్మకాలు ఏకంగా 134.68 శాతం వృద్ధిని సాధించాయి. కానీ, జనవరి 2021లో కంపెనీ విక్రయించిన 4,083 యూనిట్లతో పోలిస్తే మాత్రం, స్కార్పియో నెలవారీ అమ్మకాలు 13.49 శాతం క్షీణించాయి.

MOST READ:త్వరపడండి.. హోండా యాక్టివా 125 పై 5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్, వారికి మాత్రమే

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

గడచిన ఫిబ్రవరి 2021లో మహీంద్రా స్కార్పియోలో ఓ కొత్త వేరియంట్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా స్కార్పియో ఎస్3+ పేరుతో రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైస్ ట్యాగ్‌తో ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఎస్ 5 వేరియంట్ ధర (రూ.12.67 లక్షల) కన్నా రూ.68,000 తక్కువగా ఉంటుంది.

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 319 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో స్కార్పియో ధరలు రూ.11.99 లక్షల నుంచి రూ.16.52 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్).

MOST READ:రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

ఇదిలా ఉంటే, ఈ ఏడాది కొత్త తరం మహీంద్రా స్కార్పియో విడుదల మరింత అలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి గతేడాదే మార్కెట్లోకి రావల్సిన ఈ కొత్త మోడల్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. అయితే, ఈ ఏడాది కూడా కొత్త స్కార్పియో త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఫిబ్రవరి 2021లో దుమ్ము లేపిన మహీంద్రా స్కార్పియో సేల్స్

ఇందుకు ప్రధాన కారణం, సెమీకండక్టర్ చిప్స్ కొరతగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటోంది. మహీంద్రా థార్ విషయంలో కూడా ఇదే జరిగింది, ఫలితంగా థార్ వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరుగుతోంది.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

Most Read Articles

English summary
Mahindra Scorpio Sales Registers 134.68 Percent Growth In February 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X