కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన తమ కొత్త తరం మహీంద్రా థార్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ కంపెనీకి కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం మహీంద్రా థార్ కోసం 8-10 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉందంటేనే ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

గత ఏడాది అక్టోబర్ నెలలో మహీంద్రా థార్ మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాత నవంబర్‌లో దీని డెలివరీలు ప్రారంభమయ్యాయి. కాగా, మార్చి 2021 నాటికి మహీంద్రా 12,744 యూనిట్ల థార్ ఎస్‌యూవీలను మాత్రమే పంపిణీ చేయగలిగింది. ఆ తర్వాత దశలో కంపెనీ 40,000 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

పెండింగ్‌లో అన్ని మహీంద్రా థార్ ఎస్‌యూవీల పంపిణీని పూర్తి చేయడానికి కంపెనీకి ఒక సంవత్సరం పట్టవచ్చని చెబుతున్నారు. కొత్త తరం మహీంద్రా థార్ కోసం కంపెనీ వివిధ రకాల యాక్ససరీ ప్యాకేజ్‌లను అందిస్తున్న సంగతి తెలిసినదే. - ఈ యాక్ససరీ ప్యాక్‌లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

ఇదిలా ఉంటే, కొత్త తరం మహీంద్రా థార్ కోసం కంపెనీ సరికొత్త స్కిడ్ ప్లేట్ మరియు ఇంజన్ గార్డును యాడ్-ఆన్ యాక్ససరీగా పరిచయం చేసింది. ఈ స్కిడ్ ప్లేట్ రేడియేటర్‌కు మంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త స్కిడ్ ప్లేట్ మునుపటి కంటే మరింత బలంగా ఉంటుందని సమాచారం.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

గతంలో మహీంద్రా థార్‌లో ఆఫర్ చేసిన స్కిడ్ ప్లేట్ గురించి చాలా మంది వినియోగదారుల నుండి కంపెనీకి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, కంపెనీ కొత్త రకం స్కిడ్ ప్లేట్‌ను ఆప్షనల్‌గా ఆఫర్ చేస్తోంది. కొత్త థార్ ఎస్‌యూవీ కోసం ఈ స్కిడ్ ప్లేట్‌ను రూ.5,550 ధరకు విక్రయిస్తున్నారు.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

అలాగే, ఆఫ్-రోడింగ్ సమయంలో ఫ్యూయెల్ ట్యాంక్‌కు స్క్రాచెస్ పడుతున్నాయనే ఫిర్యాదులు రావటంతో కంపెనీ ఓ కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ ప్రొటెక్టర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫ్యూయెల్ ట్యాంగ్ గార్డ్‌ను రూ.2,335 ధరకు విక్రయిస్తున్నారు.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

మహీంద్రా తమ కొత్త తరం (సెకండ్ జనరేషన్) థార్ ఎస్‌యూవీని సరికొత్త లాడర్ ఫ్రేమ్ ఛాస్సిస్‌పై తయారు చేసింది. ఇందులోని అన్ని వేరియంట్లు షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి. ఇది మూడు రకాల రూఫ్ ఆప్షన్లతో, రెండు రకాల ఇంజన్లలో అందుబాటులో ఉంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

సరికొత్త మహీంద్రా థార్‌లో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌లను ఉపయోగించారు. ఇందులో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

ఈ రెండు ఇంజన్లు కూడా కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి. మార్కెట్లో కొత్త థార్ ప్రారంభ ధర రూ.9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

ఈ ఎస్‌యూవీని సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్, హార్డ్ టాప్ / ఫిక్స్‌డ్ టాప్ అనే మూడు రూఫ్ టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. ఈ ఎస్‌యూవీ 226 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 650 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

కొత్త థార్‌లో రూఫ్ టాప్ స్పీకర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ రియల్ టైమ్ పొజిషన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కారు యొక్క ప్రస్తుత స్థితిని చూపుతుంది. వీటితో పాటుగా, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త స్కిడ్ ప్లేట్, ఇంజన్ గార్డ్‌తో వస్తున్న మహీంద్రా థార్ - డీటేల్స్

మహీంద్రా ప్రస్తుతం ఇంధన ఆధారిత కార్లతో పాటుగా భవిష్యత్తు కోసం పూర్తి ఎలక్ట్రిక్ కార్లను కూడా అభివృద్ధి చేస్తోంది. వచ్చే 2030 తరువాత ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ బాగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గుతుందని, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, ఈ వాహనాల డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

Source: Rushlane

Most Read Articles

English summary
Mahindra Thar Gets New Skid Plate And Engine Guard, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X