మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

సరికొత్త డిజైన్, విశిష్టమైన ఫీచర్లు మరియు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన కొత్త తరం మహీంద్రా థార్‌ను కస్టమర్లు అశేషంగా ఆదరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ మోడల్ కోసం భారీ వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం ఈ ఎస్‌యూవీని దక్కించుకోవాలని వెయిట్ చేస్తుండటం చూస్తుంటే దీనికి ఉన్న క్రేజ్ ఎంటో ఇట్టే అర్థమవుతుంది.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ కొత్త తరం 2020 థార్ ఎస్‌యూవీని గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి, దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది, ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగానే పెరిగింది.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

ఈ మోడల్ కోసం సుధీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ ఈ ఐకానిక్ ఆఫ్-రోడర్‌కు 50,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. మహీంద్రా థార్ కొనుగోలుదారులలో 45 శాతం మంది ఆటోమేటిక్ వేరియంట్‌ను, 25 శాతం పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లను ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

సరికొత్త మహీంద్రా థార్ సంపాదించిన ఈ అపూర్వమైన ప్రతిస్పందన పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని, వాస్తవానికి ఇది తమ అంచనాలన్నిటినీ అధిగమించిందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా తెలిపారు.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

మహీంద్రా థార్ ఎస్‌యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తుంది. కొత్త మహీంద్రా థార్‌ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఏఎక్స్ వేరియంట్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఎల్ఎక్స్ వేరియంట్లలో ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

కంపెనీ ఈ ఎస్‌యూవీని ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచింది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ కన్వర్టిబల్ హార్డ్ టాప్ వెర్షన్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం సుమారు 6-9 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

మహీంద్రా థార్‌లోని ఎల్ఎక్స్ వేరియంట్ ప్రీమియం లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండి, సిటీ ప్రయాణాలకు, రెగ్యులర్ కమ్యూటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే, ఇందులోని ఏఎక్స్ వేరియంట్ ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ఔత్సాహికులను టార్గెట్ చేసేలా ఉంటుంది. అయితే, ఈ రెండు వేరియంట్లు కూడా అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

మహీంద్రా థార్ కోసం 50,000 బుకింగ్స్; ఇంకా తగ్గని వెయిటింగ్ పీరియడ్!

ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కారణంగా మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరగింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ తమ థార్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 2,000 యూనిట్ల నుండి 3,000 యూనిట్లకు పెంచాలని యోచిస్తున్నప్పటికీ, ఇతర వాహన పరిశ్రమల మాదిరిగానే మహీంద్రా కూడా స్టీల్ మరియు సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటోంది.

Most Read Articles

English summary
Mahindra Thar SUV Bookings Reaches 50,000 Units In Six Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X