అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన పాపులర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్‌లో కామ్‌షాఫ్ట్ సమస్య కారణంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 1,577 యూనిట్ల థార్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

కొత్త తరం మహీంద్రా థార్‌లోని కామ్‌షాఫ్ట్ లోపభూయిష్టంగా ఉందని కంపెనీ గుర్తించింది, సర్వీస్ ద్వారా ఈ సమస్యను సరిచేయనున్నట్లు కంపెనీ వివరించింది. రీకాల్‌కు గురైన మహీంద్రా థార్ వాహనాలన్నీ డీజిల్ ఇంజన్ వేరియంట్లేనని కంపెనీ పేర్కొంది.

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

సెప్టెంబర్ 7, 2020వ తేదీ నుండి డిసెంబర్ 25, 2020వ తేదీ మధ్యలో తయారైన 1,577 యూనిట్ల థార్ డీజిల్ వేరియంట్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ఈ రీకాల్ గురించి మహీంద్రా తమ కస్టమర్లను సంప్రదిస్తుందని, రీకాల్‌కు గురైన థార్ వాహన యజమానులు తమ ఎస్‌యూవీని అధీకృత మహీంద్రా సర్వీస్ సెంటర్‌కు తీసుకురావటం ద్వారా ఈ సమస్యను ఉచితంగా సరిచేస్తామని కంపెనీ పేర్కొంది.

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

గతేడాది అక్టోబర్ నెలలో మహీంద్రా తమ సరికొత్త 2020 థార్ మోడల్‌ని మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త డిజైన్, బెస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్లతో వచ్చిన కొత్త తరం థార్ మార్కెట్లో కస్టమర్లను మొదటి చూపులోనే ఆకర్షిస్తోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే భారీ మొత్తం బుకింగ్‌లు రావటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్‌ఎక్స్ అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ఇకపోతే, ఇందులోని 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఏఎక్స్ వేరియంట్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఎల్ఎక్స్ వేరియంట్లలో ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

మహీంద్రా థార్ 2020 మోడల్ ప్రారంభ ధర రూ.9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది మూడు రకాల రూఫ్ టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్ మరియు హార్డ్ టాప్ / ఫిక్స్‌డ్ టాప్ మోడళ్లు ఉన్నాయి.

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 226 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 650 మిమీ వాటర్ వాడింగ్‌ను కలిగి ఉండి ఆఫ్-రోడ్ పరిస్థితులకు అనువుగా ఉంటుంది. ఇది కేవలం 4-సీట్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో రూఫ్ టాప్ స్పీకర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తాయి.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

అలెర్ట్.. అలెర్ట్.. మహీంద్రా థార్ రీకాల్; కామ్‌షాఫ్ట్‌లో సమస్యలు!

ఈ ఎస్‌యూవీలోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ రూపంలో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే యాప్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ యాప్ అయిన బ్లూసెన్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది మరియు ఇందులో బిల్ట్ ఇన్ జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

Most Read Articles

English summary
Mahindra Recalls 1577 Units Of Thar SUV's Over Faulty Camshaft, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X