'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 అనేక అధునాతన మరియు బెస్ట్ అండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

ఈ నేపథ్యంలో, సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ ఒక్కొక్కటిగా తెలియజేస్తోంది. ఇటీవలే ఆటో బూస్టర్ హెడ్‌లైట్ సిస్టమ్ మరియు స్కైరూఫ్ ఫీచర్ల గురించిన వెల్లడించిన మహీంద్రా, ఇప్పుడు తాజాగా సరికొత్త స్పీడ్ సెన్సిటివ్ సేఫ్టీ ఫీచర్‌ను వెల్లడి చేసింది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్‌:

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో అందించబోయే స్పీడ్ అలర్ట్ సిస్టమ్, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్‌ను కలిగి ఉంటుంది. ఇది వాయిస్ కమాండ్ అలెర్ట్ రూపంలో ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని అత్యంత వేగంతో నడుపుతున్నట్లయితే, అది ఆటోమేటిక్‌గా గుర్తించి మీరు సెట్ చేసుకున్న మరియు మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో అలెర్ట్ చేస్తుంది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

ఉదాహరణకు, మీరు మీ భార్య లేదా తల్లి వాయిస్‌తో ఈ వాయిస్ కమాండ్‌ను పర్సనలైజ్ చేసుకున్నట్లయితే, మీ అతివేగాన్ని గుర్తించిన ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ సదరు వాయిస్‌తో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఫలితంగా, ఈ కారు ఆ సమయంలో మీకు ఇష్టమైన వారిని గుర్తు చేసి, మీరు మీ వాహన వేగాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది.

కారు నడిపే వ్యక్తి యొక్క భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ వాయిస్ అలెర్ట్ సిస్టమ్ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్:

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్ ఫీచర్‌ను అందించనున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ వలన ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తుంటే, ఓ కన్వర్టిబల్ కారులో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని మహీంద్రా తమ టీజర్‌లో పేర్కొంది.

ఎక్స్‌యూవీ700 మహీంద్రా ఆఫర్ చేస్తున్న ఈ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ స్కైరూఫ్ అని పిలుస్తోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క స్కైరూఫ్ పొడవు 1,360 మిమీ మరియు వెడల్పు 870 మిమీగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న పలు ఎస్‌యూవీలలో లభిస్తున్న పానరోమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కన్నా పెద్దదిగా ఉంటుందని సమాచారం.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్:

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ మరో సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను కూడా అందించనుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎక్స్‌యూవీ700ను రాత్రి సమయంలో గంటకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుపుతున్నప్పుడు, కారు దానిని ఆటోమేటిక్‌గా గుర్తించి, అదనపు భద్రత కోసం హెడ్‌లైట్ రోడ్డుపై వెదజల్లే కాంతి దూరాన్ని ఆటోమేటిక్‌గా పెంచుతుంది. ఫలితంగా, డ్రైవర్ విజిబిలిటీ మరింత పెరుగుతుంది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

కరోనా సెకండ్ వేవ్ వలన కారు విడుదల ఆలస్యం!

వాస్తవానికి ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. కానీ, దేశంలో ఎవ్వరూ ఊహించి రీతిలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ కారు విడుదల ఆలస్యమైంది. అయితే, ఇప్పుడు దేశంలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని సరికొత్త డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కన్నా ఎక్కువ పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

'ఏమండి దయచేసి నెమ్మదిగా వెళ్లండి'.. ఎక్స్‌యూవీ700లో సరికొత్త సేఫ్టీ ఫీచర్!

డీజిల్ వెర్షన్‌లో 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్‌ను మరియు పెట్రోల్ వెర్షన్‌లో 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. కొత్త తరం మహీంద్రా థార్‌లో కూడా కంపెనీ ఇవే ఇంజన్లను ఉపయోగించింది. కాకపోతే, వీటిని ఎక్స్‌యూవీ700కు అనుగుణంగా రీట్యూన్ చేసే అవకాం ఉంది.

Most Read Articles

English summary
Mahindra To Offer Personalised Safety Alerts In New XUV700, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X