సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

ఒక కారు కంపనీలో తయారు చేయబడిన తరువాత క్రాష్ టెస్ట్‌లో మంచి రేటింగ్ పొందినప్పవుడే అది ఉత్తమమైన కారు అవుతుంది. కావున ప్రతి కంపెనీ యొక్క వాహనానికి NCAP క్రాష్ టెస్ట్‌ అనేది చాలా అవసరం. ఇటీవల హ్యుందాయ్ టక్సన్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి ఉత్తమమైన కారుగా నిలిచింది.

అయితే ఇప్పుడు మహీంద్రా (Mahindra) కంపెనీ యొక్క ఎక్స్‌యువి700 (XUV700) కూడా ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి కంపెనీ యొక్క బెస్ట్ SUV గా నిలిచింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) ద్వారా మహీంద్రా ఎక్స్‌యువి700 కి సేఫ్టీ రేటింగ్ నిర్దారించబడింది. ఈ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి700 కి 5 స్టార్ రేటింగ్ వచ్చేసింది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ SUV కి 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు వచ్చాయి. కావున ఇది సేఫ్టీ విషయంలో తిరుగులేని SUV గా 5 స్టార్ రేటింగ్ పొందగలిగింది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

మహీంద్రా XUV700లో GNCAP క్రాష్ పరీక్షించిన యూనిట్ ఎంట్రీ-లెవల్ వేరియంట్, దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS బ్రేక్‌లు మరియు ISOFIX ఎంకరేజ్‌లు ఉన్నాయి. సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా XUV700ని మరింత మెరుగుపరచవచ్చని టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

మహీంద్రా XUV700 భారతదేశంలో రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంచబడింది. మహీంద్రా XUV700 ఆధునిక ఫీచర్లతో కొత్త డిజైన్‌తో అమర్చబడింది. XUV700 అనేది మెర్సిడెస్-బెంజ్ ప్రేరేపిత డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

మహీంద్రా యొక్క XUV700 లోని డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల, మెడ, ఛాతీ మరియు మోకాళ్లకు మంచి రక్షణను అందించడానికి కావలసిన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో అందించబడ్డాయి. ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

మహీంద్రా XUV700 డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

అంతే కాకూండా ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ డ్రైనెస్ అలర్ట్ సిస్టమ్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ SUV గంటకు 80 కిమీ వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. చీకటి రోడ్లలో మరింత కాంతిని అందించడం ద్వారా రాత్రిపూట మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

మహీంద్రా XUV700 స్మార్ట్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉన్న విభాగంలో మొదటి SUV. హ్యాండిల్ బయట తెరుచుకుంటుంది మరియు కేవలం ఒక టచ్ తో లోపల మూసివేయబడుతుంది. ప్రస్తుతం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ డోర్ హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

XUV700 పర్సనలైజ్ వాయిస్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. జనరల్ అలెర్ట్ సిస్టం కంటే కూడా ఇండ్యూజ్యువల్ అలెర్ట్ సిస్టం మరింత ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. ఇందులో కారు నిర్ణీత స్పీడ్‌కు మించి వెళితే డ్రైవర్‌కు తన ప్రియమైన వారి వాయిస్‌లో స్పీడ్ అలర్ట్ వినిపిస్తుంది. ఈ ఫీచర్ డ్రైవర్లను ప్రమాదాల నుంచి కాపాడుతుంది.

అంతే కాకుండా కారు నడుపుతున్నప్పుడు మీకు నిద్రగా అనిపిస్తే, దాని సిస్టమ్ మీకు ఆటోమేటిక్ హెచ్చరికను కూడా జారీ చేస్తుంది, తద్వారా మీరు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టవచ్చు. XUV700 సెగ్మెంట్‌లో లెవెల్ 1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అందించే మొదటి SUV. ఈ సిస్టమ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్-లీప్ అసిస్ట్ వంటి ఫీచర్లను నియంత్రిస్తుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra XUV700: వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అధునాతన ఫీచర్స్ కలిగిన అద్భుతమైన SUV. ఈ కారణంగానే బుకింగ్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సేఫ్టీ విషయంలో మంచి రేటింగ్ పొందటం వల్ల బుకింగ్స్ మరింత అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra xuv 700 scores 5 stars in gncap crash test details
Story first published: Wednesday, November 10, 2021, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X