రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందగలిగింది. ఇప్పటికే ఈ SUV బుకింగ్స్ 70,000 యూనిట్లు దాటేశాయి. ఇప్పటికే కంపెనీ దాదాపు 700 యూనిట్ల XUV700 కార్లను డెలివరీ చేసింది. కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం రోజుకి 187 యూనిట్ల వాహనాలను పంపిణీ చేయనుంది, కావున 2022 జనవరి నాటికి 14,000 యూనిట్లు పంపిణీ చేయబడతాయి.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

కంపెనీ ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు కేవలం 57 నిముషాల్లో ఏకంగా 25,000 యూనిట్ల బుకింగ్స్ పొందగలిగింది. మరుసటి రోజు కంపెనీ రెండు గంటల్లో మరో 25,000 బుకింగ్స్ పొందగలిగింది. ఇప్పటికి కంపెని మొత్తం 70,000 యూనిట్లు దాటేశాయి.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

కంపెనీ ప్రస్తుతం చిప్‌ల కొరత కారణంగా డెలివరీలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ కంపెనీ ఉత్పత్తి చేయడానికి తగినంత పరిమాణంలో XUV700 లను కలిగి ఉంది, కాబట్టి చిప్ సరఫరా సాధారణీకరించబడిన తర్వాత డెలివరీలను కూడా వేగంగా చూడవచ్చు. కంపెనీ సగటున 3500 యూనిట్లను డెలివరీ చేయబోతోంది.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇటీవల బుక్ చేసుకున్న కస్టమర్‌లు ఈ SUV ని డెలివరీ చేసుకోవడానికి కనీసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. కానీ డెలివరీలను మరింత వేగంగా చేయడానికి కంపెనీ అన్ని సన్నాహాలను సిద్ధం చేసుకుంటోంది.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

డెలివరీ ప్రక్రియను సులభతరం చేయడానికి అల్గారిథమ్ ఆధారిత ప్రక్రియను అమలు చేయడానికి మహీంద్రా ఒక కన్సల్టెన్సీ కంపెనీతో కలిసి పని చేస్తోంది. ప్రస్తుతం కేవలం పెట్రోల్ మోడళ్ల డెలివరీలు ప్రారంభం కాగా, ఈ నెలాఖరు నుంచి డీజిల్ మోడళ్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ ముందుగా పెట్రోల్ మోడళ్లకే ప్రాధాన్యత ఇస్తోంది.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

కొత్త మహీంద్రా XUV700 SUV డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

మహీంద్రా XUV700 స్మార్ట్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉన్న ఈ విభాగంలో మొదటి SUV. హ్యాండిల్ బయట తెరుచుకుంటుంది మరియు కేవలం ఒక టచ్ తో లోపల మూసివేయబడుతుంది. ఇవన్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వాహన వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

రోజురోజుకి పెరుగుతున్న XUV700 డిమాండ్: అప్పుడే 70,000 దాటిన బుకింగ్స్

ఇది కాకుండా మహీంద్రా & మహీంద్రా ప్రత్యేక గోల్డ్ ఎడిషన్ మహీంద్రా XUV700 ని డెలివరీ చేయడం కూడా ప్రారంభించింది. ఇటీవల జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన సుమిత్ ఆంటిల్ కి మరియు నీరజ్ చోప్రాకు గోల్డ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700ని అందజేశారు.

Most Read Articles

English summary
Mahindra xuv700 booking crosses 70000 units delivery details
Story first published: Thursday, November 4, 2021, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X