XUV700 డీజిల్ వేరియంట్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

భారతీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో కొత్త మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) SUV విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఇప్పటికే ఈ కొత్త SUV యొక్క పెట్రోల్ మోడల్స్ డెలివరీ ప్రారంభించింది. కానీ డీజిల్ మోడల్ డెలివరీలను ఇప్పుడు ప్రారంభించింది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

మహీంద్రా XUV700 డీజిల్ AX7 L ఆటోమేటిక్ వేరియంట్ మొదటి యజమాని 'సురేష్ సుతార్' అని తెలిసింది. దీనిని అతడు ఈ వారం ప్రారంభంలో డెలివరీ తీసుకున్నట్లు తెలిసింది. దీనిని అతడు మహీంద్రా XUV700 ఓనర్స్ గ్రూప్‌లో షేర్ చేశారు. కావున మిగిలిన కస్టమర్లకు కూడా డెలివరీలు త్వరలో జరుగుతాయి.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) విడుదలైన అతి తక్కువ కాలంలో గొప్ప ప్రజాదరణ పొందగలిగింది. ఈ కారణంగానే ఏ కొత్త SUV బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 3 గంటల్లోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. అయితే ఇప్పటివరకు 70,000 బుకింగ్స్ పొందగలిగింది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త SUV గొప్ప బుకింగ్స్ పొందినప్పటికీ, సెమీకండక్టర్ చిప్‌ కొరత కారణంగా డెలివరీ కొంత ఆలస్యం అవుతోంది. అయితే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మహీంద్రా 2022 జనవరి మధ్య నాటికి 14 వేల యూనిట్ల మహీంద్రా XUV700 డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా కంపెనీ పెట్రోల్ మహీంద్రా XUV700 వేరియంట్‌ను అక్టోబర్ 2021 చివరి వారంలో డెలివరీ చేయడం ప్రారంభించింది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) ఈ SUV ని రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

XUV700 డీజిల్ డెలివరీలు ప్రారంభించిన Mahindra; వివరాలు

క్రాష్ టెస్ట్ చేయబడిన యూనిట్ మహీంద్రా XUV700 ఎంట్రీ-లెవల్ వేరియంట్. కావున ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS బ్రేక్‌లు మరియు ISOFIX ఎంకరేజ్‌లు ఉన్నాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్లో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కావున ఇది మరింత భద్రతను అందిస్తుందని టెస్టింగ్ ఏజెన్సీ స్వయంగా తెలిపింది.

Most Read Articles

English summary
Mahindra xuv700 diesel variant delivery started details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X