XUV700 కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Mahindra

Mahindra And Mahindra దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ దేశీయ మార్కెట్లో థార్ వంటి వాహనాలను ప్రవేశపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. అయితే ఇప్పుడు Mahindra కంపెనీ కొత్త XUV700 విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ధర మరియు ఫీచర్స్ వంటి వాటిని తెలిపింది. ఇప్పుడు XUV700 యొక్క కలర్ ఆప్సన్స్ వెల్లడించింది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త XUV700 రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అంతే కాకూండా కంపెనీ ఈ కొత్త SUV మొత్తం 34 వేరియంట్లలో తీసుకురానున్నట్లు కూడా తెలిపింది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 వచ్చే నెలలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది 5 సీటర్ మరియు 7 సీటర్ ఆప్షన్లలో తీసుకురాబడుతుంది. Mahindra XUV700 యొక్క బ్లూ కలర్ వేరియంట్ ఇటీవలే ఆవిష్కరించబడింది. అంతే కాకుండా దీనిని మేము టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra యొక్క XUV700 యొక్క బేస్ వేరియంట్‌లో AX సిరీస్ అందుబాటులో ఉంటుంది. MX వేరియంట్ ఒకే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా AdrenoX సిరీస్ మాత్రం మూడు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి AX3, AX5 మరియు AX7 ట్రిమ్‌లు. ప్రస్తుతానికి 5 సీటర్ మాన్యువల్ మోడల్స్ ధర మాత్రమే వెల్లడైంది, మిగిలిన వేరియంట్ల ధర త్వరలో వెల్లడవుతుంది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 అద్భుతమై డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఈ SUV లో సి- ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కొత్త ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్లను పొందుతుంది. ఈ SUV చాలా పొడవుగా ఉంటుంది. ఇది 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, రిఫ్లెక్టర్ వంటివి కూడా అందుబాటులో ఉంటుంది. అవి మాత్రమే కాకుండా ఇందులో రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వాటి అధునాతన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 SUV లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి ఉన్నాయి. ఐతే కాకూండా Mahindra XUV700 లో ఈ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 లోఐ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 లో మల్టిఫుల్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్సన్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇవ్వబడింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 198 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 బుకింగ్‌లు ప్రారంభం కానప్పటికీ చాలా డీలర్‌షిప్‌లు అనధికారికంగా బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించాయి. మహీంద్రా XUV700 యొక్క టెస్ట్ డ్రైవ్ సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది మరియు అమ్మకాలు ప్రారంభమైన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయి.

ఈ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్న Mahindra XUV700

Mahindra XUV700 యొక్క వివరాలు కంపెనీ మెల్లగా వెల్లడిస్తోంది. ఇందులో భాగంగానే కలర్ రంగు ఎంపికలు వెల్లడించబడ్డాయి. మహీంద్రా XUV700 అన్ని రంగు ఎంపికలలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కస్టమర్లు వారి ప్రాధాన్యతను బట్టి వాటి నుండి ఎంచుకోవచ్చు. దేశీయ మార్కెట్లో కొత్త Mahindra XUV700 విడుదలైన తర్వాత Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari మరియు రాబోయే Jeep Meridian వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 five color options revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X