Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ XUV700 (ఎక్స్‌యూవీ సెవన్ డబుల్ ఓ) ఈ ఏడాది పండుగ సీజన్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. లేటెస్ట్ డిజైన్, అధునాతన టెక్నాలజీ మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో రూపొందించిన ఈ కారును కంపెనీ గడచిన ఆగస్ట్ నెలలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

గత నెలలో కంపెనీ Mahindra XUV700 వేరియంట్లు మరియు ధరల వివరాలను కూడా వెల్లడి చేసింది. సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. త్వరలోనే ఇందులో మరిన్ని వేరియంట్లను కూడా ప్రవేశపెడతామని కంపెనీ పేర్కొంది. వీటిలో XUV700 MX మొదటిది మరియు బేస్ వేరియంట్.

Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

Mahindra XUV700 MX బేస్ వేరియంట్ కేవలం ఒక ట్రిమ్‌లో పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో, XUV700 MX బేస్ వేరియంట్ యొక్క ధర మరియు అందులో లభించే ఫీచర్లు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంజన్, మైలేజ్ మొదలైన వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

Mahindra XUV700 MX ధర

 • Mahindra XUV700 MX పెట్రోల్ - రూ. 11.99 లక్షలు
 • Mahindra XUV700 MX డీజిల్ - రూ. 12.49 లక్షలు
 • (పైన పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ మరియు 5 సీటర్ మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్‌లకు సంబంధించినవి)

  Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

  Mahindra XUV700 MX ఫీచర్లు

  మహీంద్రా XUV700 MX బేస్ వేరియంట్ అయినప్పటికీ, కంపెనీ ఇందులో అనేక అత్యుత్తమ ఫీచర్లను అందిస్తోంది. కేవలం రూ. 11.99 లక్షల ధర వద్ద కంపెనీ ఇందులో ఉత్తమైన ఫీచర్లను జోడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
  • ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
  • స్మార్ట్ డోర్ హ్యాండిల్స్
  • ఎల్ఈడి టెయిల్ లైట్
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
  • సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు
  • పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
  • డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
  • 17 ఇంచ్ స్టీల్ వీల్స్
  • Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   Mahindra XUV700 MX ఇంటీరియర్స్

   ఇది బేస్ వేరియంట్ కావటంతో, కంపెనీ దీని ఇంటీరియర్‌లను టాప్-ఎండ్ వేరియంట్ల కంటే కొంచెం తక్కువ ప్రీమియంతో రూపొందించింది. అయితే, టాప్ మరియు బేస్ వేరియంట్ల తేడాను తెలియనీకుండా కంపెనీ ఇందులోని క్యాబిన్ చాలా క్లీన్‌ గా డిజైన్ చేసింది. దీని డాష్‌బోర్డులో ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లు రెండూ ఒకే ప్యానెల్‌లో ఉన్నట్లుగా కనిపిస్తాయి.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   అలాగే, ఇందులోని సీట్లు ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీతో రూపొందించబడ్డాయి. అయితే యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉండవు. Mahindra XUV700 MX బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఇది అవసరానికి తగిన అన్ని సాధారణ ఫీచర్లను కలిగి ఉంటుంది.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   Mahindra XUV700 MX ఇంజన్ ఆప్షన్లు

   Mahindra XUV700 MX ను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 155 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   ఇకపోతే, రెండవది 182 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఇందులోని డీజిల్ వేరియంట్‌లో మాత్రమే డ్రైవ్ మోడ్‌ లు ఇవ్వబడ్డాయి. వీటిలో మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌ లు ఉంటాయి. అవి: జిప్ (ఎకో), జాప్ (కంఫర్ట్), జూమ్ (స్పోర్ట్ / డైనమిక్) మరియు కస్టమ్.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్‌ కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కేవలం టాప్-ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   Mahindra XUV700 MX మైలేజ్

   మైలేజ్ విషయానికొస్తే, మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ కారును కొన్ని గంటల పాటు వివిధ రకాల రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేసింది. అయితే, ఇందులో ఖచ్చితమైన మైలేజీ వివరాలను మాత్రం మేము గుర్తించ లేకపోయాము. అయితే, ట్రాక్ బోర్డ్ హైస్పీడ్ టెస్ట్ చేసిన తర్వాత, MID స్క్రీన్ పై మేము సగటు మైలేజ్ ను 7.5 కిమీ మరియు 10 కిమీ మధ్యలో గుర్తించాము.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   కాగా, దీని సర్టిఫైడ్ అఫీషియల్ ఏఆర్ఏఐ మైలేజీ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అంతేకాకుండా, మేము అతి త్వరలో ఈ ఎస్‌యూవీని పూర్తిగా పరీక్షించబోతున్నాము. కాబట్టి, వాస్తవ ప్రపంచంలో దాని మైలేజ్ (రియల్ వరల్డ్ మైలేజ్) త్వరలోనే మీకు ఖచ్చితమైన సమాచారం అందిస్తాము.

   Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

   Mahindra XUV700 MX సేఫ్టీ ఫీచర్లు

   మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ బేస్ వేరియంట్ అయినప్పటికీ, కంపెనీ దీని సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. కంపెనీ ఈ కారులో అత్యుత్తమ మరియు సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ కారులో లభించే సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

   • 7 ఎయిర్‌బ్యాగులు
   • ఈబిడితో కూడిన ఏబిఎస్
   • ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్
   • ట్రాక్షన్ కంట్రోల్
   • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
   • లేన్ కీప్ అసిస్ట్
   • డ్రైవర్ ఫెటిగ్ అలెర్ట్
   • స్మార్ట్ పైలట్ అసిస్ట్
   • Mahindra XUV700 MX బేస్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు..

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

    Mahindra XUV700 యొక్క బేస్ వేరియంట్ చాలా సరసమైన ధరను కలిగి ఉండి, అందులో లభించే ఫీచర్లతో ధరకు తగిన విలువను కలిగి ఉంది. ఇందులో బేస్ వేరియంట్‌కు తగిన ఫీచర్‌లు మరియు పరికరాలను కంపెనీ అందిస్తోంది. మీరు బడ్జెట్‌లో కొత్త తరం ఎస్‌యూవీ కోసం చూస్తున్నట్లయితే, Mahindra XUV700 MX బేస్ వేరియంట్ సరైన ఎంపిక అవుతుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Mahindra xuv700 mx base variant price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X