Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన Mahindra (మహీంద్రా) కంపెనీ ఇటీవల తన కొత్త XUV700 SUV యొక్క ఉత్పత్తి పూణేలోని చకన్ ప్లాంట్ లో ప్రారంభించింది. అయితే ఈ కొత్త SUV డీలర్‌షిప్‌లకు చేరడం కూడా ప్రారంభించబడింది. అంతే కాకుండా XUV700 ఇటీవల అనేక డీలర్‌షిప్‌లలో గుర్తించబడింది. కావున టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఇప్పటికే ఈ SUV గురించి అందించిన సమాచారం ప్రకారం ఇహి మొత్తం 34 వేరియంట్లలో అందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని వేరియంట్ల వివరాలు కంపెనీ వెల్లడించింది.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 యొక్క ప్రారంభ ధర కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే అన్ని వేరియంట్ల ధరలు త్వరలో వెల్లడవుతాయి. XUV700 ప్రధానంగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కానీ, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

అలాగే, AX3 ట్రిమ్ ను 7 వేరియంట్‌ లుగా విభజించారు. వీటిలో పెట్రోల్ మాన్యువల్ 5 సీటర్, పెట్రోల్ మ్యాన్యువల్ 7 సీటర్, పెట్రోల్ ఆటోమేటిక్ 5 సీటర్, డీజిల్ మాన్యువల్ 5 సీటర్, డీజిల్ మాన్యువల్ 7 సీటర్, డీజిల్ ఆటోమేటిక్ 5 సీటర్ మరియు డీజిల్ ఆటోమేటిక్ 7 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. అదేవిధంగా, AX5 ట్రిమ్ ను కూడా 7 విభిన్న వేరియంట్లుగా విభజించారు.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

అదేవిధంగా ఈ ఎస్‌యూవీ యొక్క AX7 ట్రిమ్ 17 వేరియంట్లుగా విభజించబడింది. ఇదే అత్యధిక వేరియంట్లు కలిగిన ట్రిమ్. ఇలా మొత్తంగా 34 వేరియంట్లతో Mahindra XUV700 ఎస్‌యూవీని అందించనున్నారు. ఇందులో సగం వేరియంట్లు ఈ టాప్-ఎండ్ మోడళ్లలో అందుబాటులో ఉంచబడ్డాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో అత్యధిక ఫీచర్లు, పరికరాలు మరియు కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ లభిస్తాయి.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 ఎస్‌యూవీ 5 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త XUV700 యొక్క బేస్ వేరియంట్‌ ను MX లేదా MX సిరీస్ అనే పేరుతో పిలుస్తారు మరియు ఇది ఒకే ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

మహీంద్రా యొక్క లేటెస్ట్ అడ్రినాక్స్ సిరీస్ టెక్నాలజీతో మొత్తం మూడు ట్రిమ్‌లను అందుబాటులో ఉంచారు. అవి: AX3, AX5, AX7. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బేస్ వేరియంట్ అయిన MX పెట్రోల్ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. అలాగే, ఇందులో AX5 పెట్రోల్ ట్రిమ్ ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్ మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Mahindra XUV700 డెలివరీలు ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra xuv700 reaches dealership delivery will start soon details
Story first published: Wednesday, September 29, 2021, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X