భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీదారు 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్ కోసం కొత్త ఎస్‌యూవీ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ అయిన 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' ను ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండు వేరియంట్లు మరియు నాలుగు ట్రిమ్స్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎక్స్‌యూవీ700 డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో ఆప్సనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందించబడుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో ఉన్న రెండు వేరియంట్లలో ఒకటి ఎమ్ఎక్స్ వేరియంట్ కాగా మరొకటి అడ్రినో ఏఎక్స్ వేరియంట్. అడ్రినో ఏఎక్స్ సిరీస్ లో ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 అనే మూడు వేరియంట్లు ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రారంభ ధర ఎక్స్ షో రూమ్ ప్రకారం రూ. 11.99 లక్షలు. వేరియంట్ వారీగా ధరల కోసం కింది పట్టికను గమనించండి.

Mahindra XUV700 Price
MX Petrol ₹11.99 Lakh
MX Diesel ₹12.49 Lakh
AX3 Petrol ₹13.99 Lakh
AX5 Petrol ₹14.99 Lakh
భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ దాని ఎక్స్‌యూవీ500 నుండి ప్రేరణ పొందింది. ఎక్స్‌యూవీ700 ముందుభాగంలో కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిష్‌ కలిగిన వర్టికల్ స్లాట్‌లతో సరికొత్త గ్రిల్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కొత్త లోగోను కూడా ఈ గ్రిల్ లో చూడవచ్చు.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు రేడియేటర్ గ్రిల్ ఉన్నాయి. అంతే కాకుండా వీటికి దిగువన సిల్వర్ ఫినిష్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంది. ఫ్రంట్ ఫాసియాలో సి-షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో విలీనం చేయబడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లు ఉన్నాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఎక్స్‌యూవీ700 యొక్క సైడ్ ప్రొఫైల్ కొంత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఎక్స్‌యూవీ700 యొక్క సైడ్ ప్రొఫైల్ యొక్క హైలైట్ కొత్త డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రిఫ్లెక్టర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా, రూప్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ బాహ్య భాగంలో ఇవ్వబడ్డాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే ఇది 5 మరియు 7 సీట్ల ఎంపికలతో వస్తుంది. సీటింగ్ లేఅవుట్ ప్రకారం మధ్య వరుసలో కెప్టెన్ సీటు లేదా బెంచ్ సీటు ఇవ్వబడుతుంది. దీని సీట్లు పవర్డ్ మరియు వెంటిలేట్ చేయబడ్డాయి, ఇవి డ్రైవర్ మరియు ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. క్యాబిన్ అంతటా లెదర్ ఉపయోగించబడింది.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కి 'స్కైరూఫ్' అని పిలువబడే పెద్ద సన్‌రూఫ్ ఇవ్వబడింది. ఈ ఎస్‌యూవీలోని డ్యాష్‌బోర్డ్‌లో ఒకే స్లాబ్ గ్లాస్‌తో వస్తుంది, ఇది 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను అనుసంధానిస్తుంది. ఇందులో సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఎనేబుల్, 60 కి పైగా కనెక్ట్ ఫీచర్లు, ఇ-సిమ్ బేస్డ్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 2 వ మరియు 3 వ వరుస ఎసి వెంట్‌లు, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో మల్టిఫుల్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్సన్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇవ్వబడింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 198 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్రాండ్ యొక్క అధునాతన ఉత్పత్తి. కావున ఇది అధునాత ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 7-ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700; వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 హ్యుందాయ్ అల్కాజార్, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ మరియు రాబోయే జీప్ మెరిడియన్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 unveiled variant design features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X