ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ గడచిన మార్చి నెలలో తమ టైగన్ జిటి మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. స్టాండర్డ్ వెర్షన్ టైగన్‌తో పోల్చుకుంటే ఈ జిటి (గ్రాన్ తురిస్మో) వెర్షన్ టైగన్‌లో డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేనప్పటికీ, పెర్ఫార్మెన్స్ మరియు కొన్ని ఫీచర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి పేరుకు తగినట్లుగానే లోపల మరియు బయటి వైపు నుండి చాలా స్పోర్టీయర్‌గా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ కొత్త ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ ఎస్‌యూవీని స్టాండర్డ్ మరియు జిటి అనే రెండు వెర్షన్లలో అందించనుంది. ఈ కథనంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి ఎస్‌యూవీలో ఉండే హైలైట్స్ ఏంటి మరియు ఈ రెండు మోడళ్ల మధ్య ఉండే ప్రధాన వ్యత్యాసాలు ఏంటో తెలుసుకుందాం రండి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి మోడల్‌ను స్టాండర్డ్ మోడల్ నుండి వేరు చేయడానికి, కంపెనీ ఇందులో డ్యూయల్ కలర్ 2-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను మరియు రెడ్ కలర్‌లో పెయింట్ చేసిన బ్రేక్ కాలిపర్‌లను అందిస్తోంది. ఇవి కారు ఎక్స్టీరియర్ లుక్‌కి మరింత స్పోర్టీనెస్‌ను తెచ్చిపెడుతాయి. స్టాండర్డ్ టైగన్ మోడల్‌లో ఇవి రెండూ సాధారణంగా కనిపిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

అలాగే, ఫ్రంట్ గ్రిల్ మరియు వెనుక వైపు బూట్ డోర్‌పై కూడా ప్రత్యేకమైన జిటి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి మోడల్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కార్నరింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కూడా లభిస్తాయి.ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క టాప్ వేరియంట్‌లో ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్‌తో కూడిన స్కిడ్ ప్లేట్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లు, వెనకు వైపు బూట్ లిడ్ పొడవునా ఉన్న పెద్ద టెయిల్ ల్యాంప్ బార్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా, హై-మౌంట్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన రియర్ స్పాయిలర్, క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ మరియు సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంటీరియర్‌ ఫీచర్లను గమనిస్తే, ఇందులో వర్చువల్ కాక్‌పిట్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

టైగన్ యొక్క అన్ని వేరియంట్లలో డ్రమ్ బ్రేకులను ఉపయోగించారు. కొత్త జిటి వేరియంట్లలో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. టైగన్ కొలతలను గమనిస్తే, ఇది 4,221 మిమీ పొడవును, 1,760 మిమీ వెడల్పును మరియు 1,612 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,651 మిమీగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు టర్బో పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్. వీటిలో చిన్న 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 5,000-5,500 ఆర్‌పిఎమ్ వద్ద 114 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750-4,500 ఆర్‌పిఎమ్ వద్ద 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టైగన్ జిటి మోడళ్ల మధ్య తేడా ఏంటి?

కాగా, ఇందులోని పెద్ద 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 5,000-6,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1,600-3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. కాగా, టైగన్ జిటి వెర్షన్ కేవలం 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుందని సమాచారం.

Most Read Articles

English summary
Major differences between volkswagen taigun and taigun gt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X