భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ మాసేరటి, భారత మార్కెట్లో తమ ఉనికిని విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తమ సరికొత్త ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కారును భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మిడ్-ఇంజన్ స్పీడ్‌స్టర్ కోసం కంపెనీ బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్ యొక్క మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 2020 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం, మాసేరటి భారతదేశంలో ఘిబ్లి, లెవాంటే మరియు క్వాట్రోపోర్ట్ అనే వాహనాలను విక్రయిస్తోంది. ఈ జాబితాలోకి కొత్తగా ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్ వచ్చి చేరనుంది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

మాసేరటి ఈ కొత్త ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కారును తొలిసారిగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇటాలియన్ బ్రాండ్ నిర్మించిన ఈ కారులో శక్తివంతమైన 3.0-లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. మునుపటి వి12 యూనిట్ స్థానంలో ఈ కొత్త ఇంజన్‌ను కంపెనీ తిరిగి తీసుకువచ్చింది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

ఈ కొత్త 3.0-లీటర్ వి6 ఇంజన్ గరిష్టంగా 621 బిహెచ్‌పి శక్తిని మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

మాసేరటి ఎమ్‌సి20 తేలికైన మరియు బలమైన మోనోకోక్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడింది. కారు బరువును తక్కువగా ఉంచేందుకు దీని తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్థాలను ఉపయోగించారు. ఈ ప్లాట్‌ఫాం కన్వర్టిబుల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లపై ఆధారపడి ఉంటుంది, ఇవి భవిష్యత్తులో ఈ లైనప్‌కు జోడించబడతాయి.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

ఈ కారు డిజైన్ చాలా సింపుల్‌గా మరియు అందంగా ఉంటుంది. మాసేరటి ఎమ్‌సి20 స్పోర్ట్స్ కారు అందం మొదటి చూపులోనే అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఉంటుంది. ఈ కారు యొక్క దిగువ చివరలో బ్రాండ్ ట్రైడెంట్ లోగోతో పాటుగా సింగిల్-పీస్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

ఏరోడైనమిక్స్ కోసం రూపొందించిన ఎయిర్ వెంట్స్, కాంట్రాస్ట్ గ్లోస్ బ్లాక్ ఫినిష్‌లో ఉన్న ఫ్రంట్ స్పాయిలర్, సిజర్ డోర్స్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్, సన్నటి ఎల్ఈడి ల్యాంప్స్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

ఇంటీరియర్స్‌లో ప్రీమియం అల్కాంటారా లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు కార్బన్ ఫైబర్ మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు సెంటర్-స్టాక్డ్ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేటెస్ట్ కార్ కనెక్ట్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

భారత్‌కు రానున్న మాసేరటి ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కార్; బుకింగ్స్ ఓపెన్!

చంకీగా ఉండే స్టీరింగ్ వీల్ చాలీ స్పోర్టీగా ఉంటుంది. ఇది పాక్షికంగా లెథర్ మరియు కార్బన్ ఫైబర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది. కస్టమర్లు కావాలనుకుంటే ఇంటీరియర్‌లో కూడా ప్రీమియం అల్కాంటారా ఇన్సర్ట్‌లను ఉపయోగించవచ్చు. ఈ వాహనంలో ఐదు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: వెట్, జిటి, స్పోర్ట్, కోర్సా మరియు ఈఎస్‌సి.

Most Read Articles

English summary
Maserati MC20 Super Sports Car India Launch Expected Soon; Bookings Open. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X