మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ మాసేరటి, తమ రేసింగ్ చరిత్రకు నివాళిగో ఎఫ్ ట్రిబ్యూటో బ్యాడ్జ్‌తో రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. మోసేరటి లెవాంటే ఎస్‌యూవీ మరియు గిబ్లి సెడాన్లలో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్లను విడుదల చేసింది.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

మాసేరటి బ్రాండ్ యొక్క రేసింగ్ అరంగేట్రం సరిగ్గా 95 సంవత్సరాల క్రితం, అంటే 25 ఏప్రిల్ 1926లో ప్రారంభమైంది. అల్ఫియరీ మాసేరటి అనే రేస్ కార్ డ్రైవర్ ట్రైడెంట్ ఇంజన్‌ను కలిగిన మొట్టమొదటి రేసింగ్ కారు, టిపో 26తో టార్గా ఫ్లోరియో ట్రాక్‌పై 1,500 సిసి క్లాస్‌లో విజయాన్ని సాధించింది.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

అనంతరం 28 సంవత్సరాల తరువాత, మాసేరటి ఎఫ్ 1 లో అడుగుపెట్టి, జువాన్ మాన్యువల్ ఫాంగియో నడిపిన 250 ఎఫ్ రేస్ కారుతో ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ పయనంలో అనేక విజయాలను సాధించిన మాసేరటి బ్రాండ్, ఇప్పుడు తమ మోటార్‌స్పోర్ట్ కీర్తికి నివాళిగా ఈ రెండు స్పెషల్ మోడళ్లను పరిచయం చేసింది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

చైనాలో జరుగుతున్న 2021 షాంఘై ఆటో షోలో మాసేరటి ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించింది. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ రెండు కార్లలో బ్లాక్ కలర్ 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పసుపు రంగు బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ వీల్ ఆర్చ్ కోసం కొత్త బ్యాడ్జ్‌లు ఉన్నాయి.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

మోసేరటి లెవాంటే ఎస్‌యూవీ మరియు గిబ్లి సెడాన్లను కంపెనీ రోసో ట్రిబ్యూటో మరియు అజ్జురో ట్రిబుటో అని పిలువబడే రెండు ప్రత్యేకమైన పెయింట్ ఫినిషింగ్స్‌తో అందిస్తోంది. ఈ కొత్త పెయింట్ ఫినిషింగ్స్ తమ సంస్థ యొక్క వారసత్వానికి ఆమోదయోగ్యమైనవని మాసేరటి తెలిపింది.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇందులో మొదటి కలర్ ఆప్షన్ కంపెనీ యొక్క మొట్టమొదటి రేసింగ్ కారు, 1926 టిపో 26 మోడల్ మాదిరిగానే రెడ్ కలర్ షేడ్‌లో ఉంటుంది. ఇకపోతే, రెండవది బ్లూ కలర్ ఆప్షన్. ఇది బ్రాండ్ యొక్క సొంత నగరమైన మోడెనాను సూచిస్తుంది, ఆ నగరపు జెండాపై ఇలాంటి రంగు ఉంటుంది.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇంటీరియర్స్‌లో కూడా రెడ్ లేదా యల్లో కలర్ ఫినిషింగ్స్‌తో కూడిన బ్లాక్ లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు విశిష్టమైన స్టిచింగ్ కనిపిస్తుంది. లెవాంటే కారులో 8.4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అలాగే, గిబ్లి కారులో 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అమర్చారు. మాసేరటి ఆవిష్కరించిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ఈ ఏడాది చివరి నాటికి యూకేలో విక్రయించబడతాయి.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మాసేరటి లెవాంటే ఎఫ్ ట్రిబ్యూటో స్పెషల్ ఎడిషన్ రెండు ట్విన్-టర్బోచార్జ్డ్ 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో ఎంట్రీ-లెవల్ మోడల్ 345 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు సెకన్లలోనే గంటకు 0-62 మైళ్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 156 మైళ్లుగా ఉంటుంది.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇకపోతే, ఇందులో పెర్ఫార్మెన్స్ వేరియంట్ అయిన మాసేరటి లెవాంటే ఎస్ గరిష్టంగా 424 బిహెచ్‌పి పవర్‌ను మరియు 580 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0-62 మైళ్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 164 మైళ్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

మాసేరటి ఆవిష్కరించిన మరొక కారు గిబ్లి ఎఫ్ ట్రిబ్యూటోలో కూడా అదే 345 బిహెచ్‌పి వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ఈ కారు బరువు తక్కువగా ఉండటం వలన ఇది కేవలం 5.5 సెకన్లలోనే గంటకు 0-62 మైళ్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 166 మైళ్లుగా ఉంటుంది.

మాసేరటి ఎఫ్ ట్రిబ్యుటో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ - డీటేల్స్

ఇందులో కూడా పెర్ఫార్మెన్స్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. మాసేరటి గిబ్లి ఎస్ ఎఫ్ ట్రిబ్యూటో తన 424 బిహెచ్‌పి వి6 ఇంజన్‌ను లెవాంటే ఎస్ మోడల్‌తో పంచుకుంటుంది. ఇది కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0-62 మైళ్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 178 మైళ్లుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Maserati Unveils F Tributo Special Editions To Celebrate Its Racing History. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X