పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

ప్రముఖ వాహన తయారీసంస్థ ఫోర్స్ మోటార్స్, తన బ్రాండ్ వాహనాలను దేశీయ మార్కెట్లో చాలా సంవత్సరాలుగా విక్రయిస్తోంది. వాణిజ్య వాహన విభాగంలో ఈ సంస్థ ఒకప్పటి నుంచి చాలా ప్రాచుర్యం పొందింది. ఫోర్స్ మోటార్స్ లో అత్యంత ప్రాచుర్యం పొందినవి ట్రాలర్ వ్యాన్లు. ఈ వ్యాన్లు దేశీయ మార్కెట్లో ఎంతగానో ప్రసిద్దిచెందాయి.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

ఇప్పుడు దేశీయ మార్కెట్లో వాణిజ్య వాహనాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ రాకముందు ఫోర్స్ యొక్క వ్యాన్లు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. ఈ వ్యాన్లు వాణిజ్య ఉపయోగం కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా ఎక్కువగా కొనుగోలు చేయబడ్డాయి.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

ప్రస్తుతం మార్కెట్లో మాటాడోర్ వ్యాన్ల అమ్మకం ఆగిపోయింది. అయినప్పటికీ ఈ వ్యాన్‌లను అప్పుడప్పుడు భారతీయ రోడ్లపై చూడవచ్చు. పాత మాటాడోర్ వ్యాన్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా తయారుచేయబడ్డాయి. ఇటీవల ఈ వ్యాన్ బాగా మాడిఫైడ్ చేయబడింది. ఈ మాడిఫైడ్ వ్యాన్ యొక్క వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో దాజిష్ పి అప్‌లోడ్ చేశారు.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

ఈ వీడియోలో మాడిఫైడ్ వ్యాన్ కి సంబంధించి పూర్తి వివరాలు మీరు చూడవచ్చు. వీడియోలో వ్యాన్ ఓనర్ ఈ వ్యాన్ గురించి వివరిస్తాడు. అతడు హిందూస్తాన్ అంబాసిడర్ లేదా పాత క్లాసిక్ కార్లలో ఒకటైన కాంటెస్సాను కొనాలకున్నట్లు తెలిపాడు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యాన్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్నట్లు తెలియజేసారు.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

ఈ వ్యాన్ కొన్నప్పుడు అది మంచి స్థితిలో లేదని, అయినప్పటికీ దీన్ని కొనుగోలుచేసి అద్భుతంగా మాడిఫైడ్ చేసేవారి కోసం అన్వేషించి, మొత్తానికి ఈ వ్యాన్ అద్భుతంగా మాడిఫైడ్ చేసుకున్నాడు. మాడిఫైడ్ చేయబడిన వ్యాన్ ఇక్కడ మీరు గమనించవచ్చు.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

వ్యాన్ యొక్క వెలుపలి భాగం ఇప్పుడు 'ఆరంజ్ అండ్ వైట్' డ్యూయెల్ టోన్ కలర్ లో పెయింట్ చేయబడింది. ఈ వ్యాన్ చూసిన వెంటనే మీకు ఇంతకు ముందు అమ్మిన వోక్స్ వ్యాగన్ బస్సు గుర్తుకు వస్తుంది. ఈ వ్యాన్‌లో హెడ్‌లైట్లు కొంత మసకబారాయి. కావున దీని ముందుభాగంలో సహాయక లైట్లు భర్తీ చేయబడ్డాయి.

ఈ వ్యాన్ యొక్క వెనుక భాగంలో మహీంద్రా జీటో యొక్క టైల్ లైట్స్ అమర్చబడ్డాయి. ఈ వాహనం యొక్క వెలుపలి భాగంలో కొత్త రంగులు తప్ప పెద్ద మార్పులు చేయలేదు. ముందు డోర్ మీద విండోస్ అమర్చారు.

పాత ఫోర్స్ మాటాడోర్ వ్యాన్; ఇప్పుడు కొత్త అవతారంలో

వ్యాన్ లోపల భాగంలో ఫోర్స్ ట్రావెలర్ యొక్క సీట్లు అందించబడ్డాయి. ఈ వ్యాన్ యొక్క క్యాబిన్‌లో ఎసికి బదులుగా ఫ్యాన్ ఏర్పాటుచేశారు. అదనపు గాలి కోసం పైకప్పుపై ప్రదేశాలలో కూడా ఓపెన్ చేయబడి ఉంటుంది. ఈ మాడిఫైడ్ వ్యాన్ లో టీవీ, మ్యూజిక్ సిస్టమ్ మరియు ఇండక్షన్ కుక్కర్ ఉన్నాయి. ఈ వ్యాన్ పైకప్పుపైన సోలార్ ప్లేట్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

Most Read Articles

English summary
Matador Van Modified Like A Volkswagen Bus. Read in Telugu.
Story first published: Wednesday, June 30, 2021, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X