భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారత మార్కెట్లో తమ సరికొత్త హైపర్ హ్యాచ్‌బ్యాక్ మెర్సిడెస్-ఏఎమ్‌జి ఏ45 ఎస్ 4మ్యాటిక్ ప్లస్ (Mercedes-AMG A45 S 4MATIC+) ను నేడు (నవంబర్ 19, 2021) మార్కెట్లో విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఎంట్రీ లెవల్ సిరీస్ అయిన A-క్లాస్ నుండి వచ్చిన ఈ హై పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇది భారతదేశంలోనే 'అత్యంత శక్తివంతమైన లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ సిరీస్ కలిగిన ప్రొడక్షన్ కారు అని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ సరికొత్త Mercedes-AMG A 45 S 4MATIC+ కారును మెర్సిడెస్ బెంజ్ యొక్క పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అయిన AMG ప్రత్యేకమైన 'డ్రైవింగ్ డైనమిక్స్ మరియు పెర్ఫార్మెన్స్' తో అభివృద్ధి చేసింది. ఈ చిన్న లగ్జరీ కారులో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 421 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే చాలా విశిష్టంగా ఉంటుంది. ఇందులో ఏఎమ్‌జి-స్పెసిఫిక్ రేడియేటర్ గ్రిల్, ఏరోడైనమిక్ బోనెట్, పవర్‌డోమ్‌లు, మల్టీ-బీమ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, విశాలమైన ఫ్రంట్ వింగ్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు మరియు ఏఎమ్‌జి బ్రాండ్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త ఏ45 ఎస్ 4మ్యాటిక్ ప్లస్ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత గంభీరమైన లుక్‌ని మరియు స్పోర్టీ క్యారెక్టర్‌ను జోడించడంలో సహకరిస్తాయి.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కారు బయట కనిపించే స్పోర్టీ ఎలిమెంట్స్ లోపలి భాగంలో కూడా ఉంటాయి. అధిక-నాణ్యత కలిగిన మెటీరియల్స్, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఏఎమ్‌జి స్పెసిఫిక్ స్పోర్ట్ సీట్లు, నలుపు రంగు ARTICO మానవ నిర్మిత (మ్యాన్ మేడ్) లెథర్ మరియు DINAMICA మైక్రోఫైబర్ కలయికతో రూపొందించిన అప్‌హోలెస్ట్రీ, దానిపై ఎరుపు రంగులో ఉండే డబుల్ టాప్‌ స్టిచింగ్‌ వంటి విలక్షణమైన ఏఎమ్‌జి బ్రాండ్ స్పెసిఫిక్ హైలైట్‌లను ఇంటీరియర్స్‌లో గమనించవచ్చు.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ కారు లోపలి భాగంలో స్పోర్టీనెస్‌ను మరింత పెంచడం కోసం కంపెనీ ఇందులో ఎరుపు రంగులో ఉండే సీట్ బెల్ట్‌లు మరియు డ్యాష్‌బోర్డుపై రెడ్ కలర్ యాక్సెంట్స్ వంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పోర్టీ డ్రైవింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవం కోసం, ఈ కారులో హెడ్-అప్ డిస్‌ప్లే విండ్‌స్క్రీన్‌ ఉంటుంది, ఇది కారు లోపలి భాగాన్ని డిజిటల్ కాక్‌పిట్‌గా మారుస్తుంది. ప్రయాణీకుల వినోదాన్ని మరింత పెంచడానికి, Mercedes-AMG A 45 S 4MATIC+ కారులో కంపెనీ 12 స్పీకర్లు మరియు 590 వాట్ల అవుట్‌పుట్‌తో కూడిన హై ఎండ్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తోంది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ పెర్ఫార్మెన్స్ కారు కోసం అందుబాటులో ఉన్న పెయింట్ ఆప్షన్లలో సన్ ఎల్లో, పోలార్ వైట్, మౌంటైన్ గ్రే, డిజైనో పటగోనియా రెడ్, డిజైనో మౌంటైన్ గ్రే మాగ్నో మరియు కాస్మోస్ బ్లాక్ ఉన్నాయి. ఓవరాల్‌గా మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ 4మ్యాటిక్ ప్లస్ హ్యాచ్‌బ్యాక్ టెక్నాలజీ, ఫంక్షనాలిటీ మరియు సేఫ్టీల కలయికతో సాటిలేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఈ హై పెర్ఫార్మెన్స్ కారులో అమర్చిన రోలర్ బేరింగ్ ట్విన్‌స్క్రోల్ టర్బోచార్జర్‌తో కూడిన పవర్‌ఫుల్ 2.0-లీటర్ (1991సిసి) 4-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 421 బిహెచ్‌పి శక్తిని మరియు 5000-5250 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ డిసిటి 8జి డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 270 కిమీగా ఉంటుంది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఆసక్తికరకమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఇంజన్ పూర్తిగా చేతితో అసెంబుల్ చేయబడింది. జర్మనీలోని అఫాల్టర్‌బాక్‌లో ఉన్న ఏఎమ్‌జి ఇంజన్ ఫ్యాక్టరీలో కొత్తగా రూపొందించిన ప్రొడక్షన్ లైన్ పై ఇది నిర్మించబడింది. మెర్సిడెస్ ఏఎమ్‌జి ఫ్యాక్టరీలో "వన్ మ్యాన్, వన్ ఇంజన్" సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇది ఇండస్ట్రీ 4.0 ప్రక్రియలను ఒక వినూత్న స్థాయికి తీసుకువెళ్లింది. ఇందులో మొత్తం 6 ఏఎమ్‌జి డైనమిక్ సెలెక్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి: స్లిప్పరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఇండివిడ్యువల్ మరియు రేస్.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ కారు వినూత్నమైన రేస్ స్టార్ట్ ఫీచర్ తో వస్తుంది. దీని సాయంతో ఇది అతి తక్కువ సమయంలోనే నిలిచిపోయిన స్థితి నుండి వేగవంతమైన యాక్సిలరేషన్‌ను పొందుతుంది. ఈ కారు కోసం కంపెనీ ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ ప్యాకేజ్ మరియు ఏఎమ్‌జి ట్రాక్ పేస్ లను కూడా అందిస్తోంది. ఈ ఏఎమ్‌జి ట్రాక్ పేస్ వ్యక్తిగత రేసింగ్ ఇంజనీర్ యొక్క డ్రైవింగ్ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా విశ్లేషించడానికి మరియు మెరుగుపరచడానికి MBUX మల్టీమీడియా సిస్టమ్‌లో విలీనం చేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో Mercedes-AMG A45 S 4MATIC+ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ చిన్న కారులో కంపెనీ అనేక అద్భుతమైన భద్రతా ఫీచర్లను అందిస్తోంది. వీటిలో బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ఏఎమ్‌జి టార్క్ కంట్రోల్, ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ బ్రేకింగ్ సిస్టమ్‌లతో పాటుగా అన్ని ఇతర స్టాండర్డ్ ఫీచర్లు మరియు ఇతర డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఇందులో ఏఎమ్‌జి ఎక్స్‌టీరియర్ సిల్వర్ క్రోమ్ ప్యాకేజ్, ఫ్రంట్ స్ప్లిటర్ ఇన్‌సర్ట్‌లు, ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Mercedes amg a45 s launched in india
Story first published: Friday, November 19, 2021, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X