ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Mercedes-Benz (మెర్సిడెస్ బెంజ్) భారతీయ మార్కెట్ కోసం Retail of the Future (రిటైల్ ఆఫ్ ది ఫ్యూచర్) అనే 'డైరెక్ట్ టు కస్టమర్' సేల్స్ ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త సేల్స్ ప్రోగ్రామ్ కోసం ఇది వరకే సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు, అయితే ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ మార్కెట్లో ప్రారంభించారు.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

Mercedes-Benz ప్రారంభించిన ఈ కొత్త Retail of the Future అనేది భారతీయ మార్కెట్లో మొదటి సికెడి మార్కెట్. అంతే కాకుండా కంపెనీకి ప్రపంచంలో నాల్గవ మార్కెట్ మన ఇండియా. ఇప్పటికే కంపెనీ Retail of the Future ద్వారా 1,700 బుకింగ్‌లను పొందింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త మార్కెట్ ప్రస్తుతం కొత్త కార్ల విక్రయానికి మాత్రమే పరిమితం చేయబడింది.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ యొక్క మొత్తం స్టాక్ Retail of the Future బిజినెస్ మోడల్ కింద ఉంచబడుతుంది. అంతే కాకుండా, వాహనం నేరుగా కస్టమర్‌లకు ఇన్‌వాయిస్ చేయబడుతుంది, నియమించబడిన ఫ్రాంచైజ్ భాగస్వాముల ద్వారా రిటైల్ చేయబడుతుంది. కస్టమర్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి మరియు నెరవేర్చడానికి కంపెనీ ఇప్పుడు బాధ్యత వహిస్తుంది.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సి‌ఈ‌ఓ 'మార్టిన్ ష్వెంక్' మాట్లాడుతూ, Retail of the Future తో మేము ఎన్నో ఇండస్ట్రి -ఫస్ట్ ఇనీషియేటివ్ తో కంప్లీట్ యూనిఫైడ్ కస్టమర్ జర్ని అనుభవాన్ని సృష్టించాము. భారతదేశంలో మొదటిసారిగా ఇన్సిడెంటల్ లేదా ఎక్స్ట్రా చార్జెస్ కస్టమర్‌లకు ఉండవు.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

కస్టమర్‌లు ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేషనల్ స్టాక్‌కి ఎన్నో రకాలైన ఇన్వెంటరీ ఆప్షన్స్ తో నేరుగా యాక్సెస్ చేయగలరు. Retail of the Future అనేది మా కస్టమర్‌లకు మరింత చేరువ కావడానికి అలాగే అభివృద్ధి చెందుతున్న అవసరాలు, వారి కోరికలను వినడాకి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశంలో అత్యంత విశ్వసనీయమైన లగ్జరీ బ్రాండ్‌గా మేము కస్టమర్ సెంట్రిసిటీలో కొత్త స్టాండర్డ్ సెట్ చేసాము అని ఆయన అన్నారు.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త విధానం ప్రకారం కంపెనీ యొక్క మోడల్ ధరలను జాతీయంగా నిర్ణయిస్తుంది, కావున భారతదేశం అంతటా ఈ ధరలు ఒకేవిధంగా ఉంటాయి. కస్టమర్‌లు ఇప్పుడు జాతీయ స్టాక్‌కు నేరుగా యాక్సెస్‌ను పొందబోతున్నారు మరియు పారదర్శకతను కొనసాగించడానికి కంపెనీ ఆర్డర్ బుకింగ్ దశలో కస్టమర్‌లకు మొదటిసారిగా విఐఎన్ నంబర్‌లను అందిస్తుంది.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

జాతీయ స్టాక్‌లో కస్టమర్ తమకు నచ్చిన వాహనాన్ని కనుగొన్న తర్వాత, వారు రూ .50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తదుపరి 14 రోజుల్లో ఆర్డర్ పూర్తయింది, తరువాత ఆర్డర్ బుకింగ్‌తో కంపెనీ విఐఎన్ నంబర్‌ను నిర్ధారిస్తుంది. తరువాత కస్టమర్‌కు ఈ-మెయిల్ పంపడం ద్వారా ధృవీకరణ ఇవ్వబడుతుంది.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

ఇది ఎందుకంటే ఫ్రాంచైజ్ భాగస్వామి ద్వారా కారు కస్టమర్‌కు డెలివరీ చేయబడుతుంది. కస్టమర్ చెల్లింపు ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో పూర్తి చేయవచ్చు. ఏడు రోజులలోపు చెల్లింపు అందిన తర్వాత, Mercedes-Benz నుండి చివరి ఇన్‌వాయిస్ కస్టమర్‌కు డెలివరీ చేయబడుతుంది. ఫ్రాంచైన్ భాగస్వామి కస్టమర్ ఇంటి వద్దకే కారును డెలివరీ చేస్తారు లేదా షోరూమ్‌లో డెలివరీ చేస్తారు.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త విధానం కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ బిజినెస్ కింద కస్టమర్‌లు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. ఇందులో బెస్ట్ ప్రైస్ గ్యారెంటీ పొందడానికి, పూర్తి పారదర్శకత మరియు ఉత్పత్తుల యొక్క మెరుగైన దృశ్యమానతను, ఫ్రాంచైజ్ భాగస్వాముల నుండి ఉత్తమ కస్టమర్ సేవను అందించడానికి సహాయపడతాయి.

ఇప్పుడు Benz కార్లు కొనేందుకు కొత్త పద్ధతి 'Retail of the Future': పూర్తి వివరాలు

ఇవి మాత్రమే కాకుండా Retail of the Future వ్యాపారం కింద ప్రయోజనాలు ఫ్రాంఛైజీ భాగస్వాములకు ఇవ్వబడతాయి. ఫ్రాంఛైజీ భాగస్వాములు జీరో ఇన్వెంటరీ, మార్కెట్ రిస్క్ ఎక్స్‌పోజర్ మరియు ఉత్తమ కస్టమర్ అనుభవం కోసం సౌకర్యాలను పొందుతారు. మొత్తానికి కంపెనీ ప్రారంభించిన ఈ Retail of the Future బెంజ్ కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

Most Read Articles

English summary
Mercedes benz introduced new retail of the future business details
Story first published: Saturday, October 23, 2021, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X