MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ (MG Motor) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 15, 2021వ తేదీన) అధికారికంగా ఆవిష్కరించింది. ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) తో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ను కంపెనీ అటానమస్ లెవల్ -2 (Autonomous Level-2) సిస్టమ్ మరియు ఏఐ అసిస్టెంట్‌ (AI Assistanat) సాంకేతికతతో రూపొందించింది. ఈ ఏడాది పండుగ సీజన్‌ లో ఆస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. కస్టమర్ల కోసం MG Astor ఈ వారం చివరి నుండి కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

MG Astor డిజైన్ ను గమనిస్తే, కంపెనీ ఈ కారును తమ పాపులర్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇందులో ఎమ్‌జి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన లోవర్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో కూడిన సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు ఫ్రంట్ బంపర్ పై మజిక్యుల్ బాడీ లైన్స్ తో ఇది బలమైన రూపాన్ని కలిగి ఉంటుంది.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇంకా ఇందులో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిష్ తో కూడిన అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVM) మరియు సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ కలర్ ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, బాడీ చుట్టూ సన్నగా డిజైన్ చేసిన బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, వెనుక వైపు స్ల్పిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్ మరియు వాషర్, బూట్ డోర్ మధ్యలో పెద్ద MG లోగో మరియు దాని క్రింద Astor బ్యాడ్జింగ్, క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ మరియు బంపర్‌లో అమర్చిన రిఫ్లెక్టర్స్ వంటి మార్పులు ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

కొత్త MG Astor ను కంపెనీ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీ కలిగిన కారు అని కంపనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ సహాయంతో కారులో పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇది మీ వాయిస్ కమాండ్స్ కి అనుగుణంగా పనిచేస్తుంది.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఈ వాయిస్ కమాండ్స్ సాయంతో మ్యూజిక్, ఫోన్ కాల్స్ వంటి అనేక రకాల ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత దీపా మాలిక్ వాయిస్ ను ఈ ఎస్‌యూవీలో పర్సనల్ అసిస్టెంట్ వాయిస్ గా ఉపయోగించారు. నిజంగా ఇది చాలా గర్వించదగిన విషయం.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

MG Astor మొత్తం మూడు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని డ్రైవర్ సీటును డ్రైవర్ సౌకర్యానికి తగినట్లుగా ఆరు రకాలుగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. అవి: నార్మల్, అర్బన్ మరియు డైనమిక్.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇంకా ఇందులో వినోదం కోసం 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్రైవర్ సమాచారం కోసం 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు క్యాబిన్ లోపల స్వచ్ఛమైన గాలి కోసం పిఎమ్ 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

అంతేకాకుండా, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హీటెడ్ సైడ్ మిర్రర్స్, రియర్ ఏసి వెంట్స్, ముందు మరియు వెనుక సీట్లలో ప్రయాణీకుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు కూడా లభిస్తాయి. కొత్త MG Astor లోని అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ కోసం కంపెనీ రిలయన్స్ జియో సంస్థతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కారులో లోపల రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ లభ్యం కానున్నాయి.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇందుకోసం ఇ-సిమ్ మరియు ఎల్‌టిఈ టెక్నాలజీని రిలయన్స్ జియో సరఫరా చేస్తుంది. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిస్‌ప్లే స్క్రీన్‌పై రోబోట్ కనిపిస్తుంది. ఈ కారులోని అటానమస్ లెవల్-2 ఫీచర్లలో భాగంగా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్లైజన్ అలెర్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఈ కారులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్మార్ట్ కీ ఉంటుంది. అంటే, కారును యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లాక్ చేయటం అన్‌లాక్ చేయటం చేయవచ్చు. MG Astor లో ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ ను కూడా జోడించారు. ఈ ఫీచర్ సాయంతో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని గుర్తించవచ్చు.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇక MG Astor కొలతల విషయానికి వస్తే, దీని మొత్తం పొడవు 4323 మిమీ, వెడల్పు 1809 మిమీ, ఎత్తు 1650 మిమీగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.

MG Astor ఎస్‌యూవీఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇకపోతే, రెండవది 1498 సిసి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.

Most Read Articles

English summary
Mg astor suv unveiled design features specs and other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X