కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, గడచిన ఏప్రిల్ నెల నుండి దేశంలోని అనేక ప్రాంతాల్లో సంపూర్ణ/పాక్షిక లాక్‌డౌన్‌లు మరియు కర్ఫ్యూలు అమలవుతున్న సంగతి తెలిసినదే. అయితే, ఇటీవలి కాలంలో కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఈ నేపథ్యంలో, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు, జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. వ్యాపారాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్‌జి మోటార్ ఇండియా కూడా తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

అయితే, కంపెనీ ఈసారి గతంలో కన్నా మరింత మెరుగ్గా తమ కస్టమర్లకు సేవలు అందించాలని ప్లాన్ చేస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా అంతం మాత్రం కాలేదు. దీంతో, ఎమ్‌జి మోటార్ కంపెనీ తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొన్ని కొన్ని రకాల కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ ఇండియా తమ వినియోగదారుల కోసం డోర్ స్టెప్ కార్ సేవలను అందించడం ప్రారంభించింది. కస్టమర్ల సౌలభ్యం కోసం, ఈ కంపెనీ శిక్షణ పొందిన కార్ టెక్నీషియన్ల బృందాన్ని రూపొందించింది. ఈ బృందం కోవిడ్-19 యొక్క అన్ని మార్గదర్శకాలను అనుసరించి సేవలను అందించనుంది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఇందులో భాగంగా, కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి, సురక్షితమైన మరియు కాంటాక్ట్‌లెస్ సేవలను అందించేలా కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ సేవలలో కార్ల శానిటైజేషన్, ఫ్యూమిగేషన్, జనరల్ కార్ చెక్-అప్ మరియు కార్ డ్రై వాష్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, చిన్నపాటి మరమ్మతులు మరియు ఫిట్‌మెంట్లు కూడా కస్టమర్ల ఇంటివద్దనే చేయనున్నారు.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ కంపెనీ తమ కస్టమర్ల అందిస్తున్న ఈ సేవలను మై ఎమ్‌జి యాప్ ద్వారా పొందవచ్చు. ఈ సేవల కోసం కంపెనీ ప్రత్యేక పోర్టబుల్ పరికరాలను ఉపయోగించనుంది. ఇది ఎమ్‌జెర్మ్ క్లీన్ ఫ్యూమిగేషన్, డ్రై వాష్ మరియు కొన్ని చిన్నపాటి మరమ్మతులు వంటి సౌకర్యాలను అందిస్తుంది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

వినియోగదారుల భద్రత దృష్ట్యా తాము ఈ డోర్ స్టెప్ సర్వీస్ క్యాంపెయిన్ ప్రారంభించామని కంపెనీ తెలిపింది. కస్టమర్ల ఇళ్లకు చేరేముందు సంస్థ యొక్క సాంకేతిక నిపుణులు తమను తాము పూర్తిగా శుభ్రపరుచుకుంటారు, కాబట్టి వైరస్ సంక్రమణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి తమ డీలర్‌షిప్‌లన్నింటినీ కూడా పూర్తిగా కాంటాక్ట్‌లెస్‌గా చేసింది. అక్కడ అందుబాటులో ఉన్న ప్రతి సేవ ఇప్పుడు కస్టమర్‌తో నేరుగా ఎటువంటి కాంటాక్ట్ లేకుండా అందించబడుతుంది. ఇందులో వాయిస్ అసిస్ట్, డిజిటల్ డిస్‌ప్లే మరియు వినియోగదారులకు కాంటాక్ట్ / డిజిటల్ చెల్లింపులు మొదలైనవి ఉన్నాయి.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

అయితే, కొన్ని ముఖ్యమైన మరమ్మతులు మరియు బాడీ షాప్ పనుల కోసం మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా సర్వీస్ సెంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఎమ్‌జి మోటార్ ఇండియాకు ప్రస్తుతం భారతదేశం అంతటా 245 టచ్ పాయింట్లతో కూడిన విస్తారమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉంది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవల తమ వినియోగదారులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య సంప్రదింపులు అందించడానికి ఎమ్‌జి హెల్త్‌లైన్‌ను కూడా ప్రారంభించింది. ఎమ్‌జి కార్లను కలిగి ఉన్న కస్టమర్లు సంస్థ యొక్క వెబ్‌సైట్‌లో కానీ లేదా తమ స్మార్ట్‌ఫోన్లలో మై ఎమ్‌జి యాప్‌లో కానీ తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

కస్టమర్ల కోసం డోర్ స్టెప్ కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి హెల్త్‌లైన్‌ సేవలో భాగంగా, ఎమ్‌జి మోటార్ కస్టమర్లకు లేదా వారి కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా, ఉత్తమమైన వైద్యులతో ఉచితంగా సంప్రదింపులు చేయవచ్చు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న నేపథ్యంలో, కంపెనీ ప్రారంభించిన ఈ చర్య తమ కస్టమర్లకు మరియు వారి కుటుంబాలకు ఎంతగానో సహకరించనుంది.

Most Read Articles

English summary
MG Motor India Starts No Contact Doorstep Home Service Facility For Its Customers, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X