MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ (MG Motor), భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జిఎస్ ఈవీ (MG ZS EV) గత నెలలో కూడా అత్యధిక బుకింగ్ లను దక్కించుకుంది. ఆగస్ట్ 2021 లో ఈ ఎలక్ట్రిక్ కారు కోసం గరిష్టంగా 700 యూనిట్ల బుకింగ్ లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

దేశీయ విపణిలో MG ZS EV కోసం ఇవే అత్యధిక నెలవారీ బుకింగ్ లు అని కంపెనీ తెలిపింది. అంతకు ముందు (జులై 2021) నెలలో ఈ కారు కోసం 600 యూనిట్లు బుకింగ్ లు వచ్చినట్లు MG Motor వెల్లడించింది. గత కొన్ని నెలలుగా తమ ఎలక్ట్రిక్ కార్ గురించి వచ్చే ఎంక్వైరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్ రాజీవ్ ఛాబా అన్నారు.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, ఈ విభాగంలో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. వాస్తవానికి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 53 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే, ఈ విభాగం ఒక్క ఏడాదిలోనే సగానికి పైగా వృద్ధిని సాధించింది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ప్రస్తుతం, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు Tata Nexon EV. ఇందుకు ప్రధాన కారణం, దీని సరసమైన ధర. కేవలం రూ. 13.99 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్) ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. Tata Motors ప్రతి నెలా సగటున 500 యూనిట్ల నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

కాగా, ఈ విభాగంలో అందుబాటులో MG ZS EV, Hyundai Kona వంటి ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ. 20 లక్షలకు పైనే ఉన్నాయి. Tata Nexon సగటు నెలవారీ అమ్మకాలతో పోల్చి చూస్తే, MG ZS EV నెలకు సుమారు 250 నుండి 300 యూనిట్ల వరకు అమ్ముడవుతోంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డిమాండ్ కాదు, సరఫరా. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించాయి. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్లలో ఈ చిప్స్ వినియోగం సాధారణ పెట్రోల్ / డీజిల్ కార్ల కన్నా ఎక్కువగా ఉంటుంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

భారతదేశంలో ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, టొయోటా సహా అనేక ఇతర ఆటోమొబైల్ కంపెనీలు సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ కరోనా మహమ్మారి కారణంగా, ఆటోమొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ చిప్స్ కొరత ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

చిప్ కొరత ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని కుదిస్తున్నాయి. తక్కువ వాహనాల ఉత్పత్తి కారణంగా డిమాండ్ మరియు సప్లయ్ మధ్య భారీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి, భారతదేశంలో పండుగ సీజన్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ పండుగ సీజన్ లో వాహనల కోసం డిమాండ్ భారీగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

MG ZS EV ఎలక్ట్రిక్ కారు గురించి క్లుప్తంగా..

MG ZS EV విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారుని భారతదేశంలో తొలిసారిగా జనవరి 2020లో విడుదల చేశారు. కాగా, ఫిబ్రవరి 2021 నెలలో కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ని కూడా విడుదల చేసింది. ఇది ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

వీటిలో ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు కాగా ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 24.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 44.5 kWh IP6 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

చార్జింగ్ విషయానికి వస్తే, హోమ్ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 50 నిమిషాల్లోనే ఈ ఎస్‌యూవీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 8 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తోంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

ఇక రేంజ్ విషయానికి వస్తే, MG ZS EV పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 419 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఈ విభాగంలో లభిస్తున్న టాటా నెక్సాన్ ఈవీ రేంజ్ (312 కిమీ) కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన ఆఫర్ చేసే రేంజ్ (452 ​​కిమీ) కన్నా తక్కువగా ఉంటుంది.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

MG ZS EV కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఈ కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో ఆల్ పవర్ విండోస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ కండీషనర్, రివర్స్ పార్కింగ్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పవర్ స్టీరింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MG ZS EV కోసం 700 యూనిట్ల బుకింగ్స్.. ఇదే నెలవారీ అత్యధికం..

MG ZS EV సబ్‌స్క్రిప్షన్ ప్లాన్..

MG Motor ఇటీవల తమ ZS EV కోసం ఓ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు ప్రతి నెలా రూ. 49,999 చందాతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద ZS EV ని కొనుగోలు చేయవచ్చు. ఏక కాలంలో మొత్తం డబ్బు చెల్లించి ఈ కారును కొనలేని కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ప్లాన్‌ ను ప్రవేశపెట్టింది.

Most Read Articles

English summary
Mg zs ev gets 700 unit bookings in august 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X