Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

చైనాలో జరుగుతున్న 2021 గ్వాంగ్‌జౌ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ (GIAE) లో జపనీస్ కార్ బ్రాండ్ మిత్సుబిషి (Mitsubishi) తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కొత్త 2022 మిత్సుబిషి ఎయిర్‌ట్రెక్ (Mitsubishi Airtrek) పేరుతో కంపెనీ ఓ 5 సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

మిత్సుబిషి ఎయిర్‌ట్రెక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆడి క్యూ5 ఇ-ట్రోన్ వంటి పూర్తిస్థాయి ఎస్‌యూవీ కాకపోయినప్పటికీ, ఇదొక 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మిత్సుబిషి ఈ కారును ప్రత్యేకించి చైనా మార్కెట్ కోసం రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ కారును GAC మరియు Mitsubishi Motors కంపెనీలు జాయింట్ వెంచర్ గా ఏర్పడి తయారు చేశాయి. దీని కాన్సెప్ట్ వెర్షన్ ను మొదటిసారిగా షాంఘై ఆటో షోలో ప్రదర్శించారు.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

మిత్సుబిషి ఎయిర్‌ట్రెక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ముందు వైపు నుండి చూడటానికి గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. ఎత్తులో ఉండే బానెట్, ప్యానెలో తో రీప్లేస్ చేసిన ఫేక్ ఫ్రంట్ గ్రిల్, సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఐస్ క్యూబ్ స్టైల్ ఎల్ఈడి హెడ్‌లైట్స్ మరియు వాటి దిగువవ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ రూఫ్ మరియు సైడ్ మిర్రర్స్, రూఫ్ మౌంటెడ్ రెయిల్స్ (నాన్ ఫంక్షనల్), బ్లాక్డ్ అవుట్ పిల్లర్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ రూఫ్ స్పాయిలర్స్ మరియు సన్నటి స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ను ఇందులో గమనించవచ్చు.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఈ కారు సైడ్ లో ఇది ఈవీ అని గుర్తు చేయడానికి ఫ్రంట్ డోర్ పై 'EV' బ్యాడ్జింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇందులో క్రోమ్ ఇన్సర్ట్‌లు ఫెండర్ నుండి వెనుక స్పాయిలర్ వరకు ఉంటుంది, అలాగే ఫ్రంట్ అండ్ రియర్ డోర్ దిగువన కూడా ఈ క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. ఇందులోని ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ కారును అన్ లాక్ చేయగానే ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. ఇందులో ప్రత్యేకమైన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను ఉపయోగించారు. వెనుక భాగంలో ఈ కారు బూట్ చాలా వెడల్పుగా మరియు విశాలంగా ఉంటుంది.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఇక మిత్సుబిషి ఎయిర్‌ట్రెక్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరయర్స్ ని గమనిస్తే, కారు లోపల డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ సిల్వర్ లెదర్ తో కుట్టిన అప్‌హోలెస్ట్రీ చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు AC కంట్రోల్స్ కోసం కెపాసిటివ్ బటన్‌లతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్‌ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. ఈ కారు లోని విశాలమైన డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్, కారు లోపల విమానం లాంటి కాక్‌పిట్ అనుభూతిని అందిస్తుంది.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

పెర్ఫార్మెన్స్ గణాంకాల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో గరిష్టంగా 181 హార్స్ పవర్ ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు అమర్చబడి ఉంటుంది మరియు ఇది 69.9 kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేసుకుంటే, దాని సాయంతో గరిష్టంగా 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. కస్టమర్‌ లకు మరింత అదనపు సమాచారాన్ని అందించడం కోసం కంపెనీ ఇందులో మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తోంది.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

Mitsubishi Outlander PHEV ఆవిష్కరణ

మిత్సుబిషి బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ జపనీస్ బ్రాండ్ తాజాగా తమ సరికొత్త తరం అవుట్‌ల్యాండర్ (Outlander) క్రాస్ఓవర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదొక కొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (PHEV) మరియు ఇది గ్లోబల్ మార్కెట్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మిత్సుబిషి అవుట్‌లాండర్ పిహెచ్ఈవి (Mitsubishi Outlander PHEV) యొక్క వర్చువల్ ప్రీమియర్ ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.

Mitsubishi Airtrek 5-సీటర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

కొత్త 2022 మిత్సుబిషి అవుట్‌లాండర్ పిహెచ్ఈవి ని కంపెనీ నేటి తరం యువతను లక్ష్యంగా చేసుకొని చాలా స్పోర్టీగా మరియు అంతే ప్రీమియంగా డిజైన్ చేసింది. ఈ కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు చాలా అధునాతంగా ఉండి, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతానికి, కంపెనీ ఈ కొత్త అవుట్‌లాండర్ PHEV ఎస్‌యూవీ స్పెసిఫికేషన్ల గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అయితే న్యూ జనరేషన్ మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో పూర్తిగా అభివృద్ధి చెందిన కొత్త తరం PHEV సిస్టం ఉంటుందని మాత్రం తెలుస్తోంది. కాబట్టి, మునుపటి కంటే మరింత మెరుగైన పనితీరును మరియు అధిక డ్రైవింగ్ పరిధిని అందించే పవర్‌ట్రైన్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mitsubishi unveils airtrek 5 seater electric compact suv at giae details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X