2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi (ఆడి) భారతీయ మార్కెట్లో తన కొత్త 2021 Audi Q5 Facelift (2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్) SUV ని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తిని స్థానికంగా ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త '2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్' కంపెనీ యొక్క లైనప్ లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుందని తెలిపింది. ఈ SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, కావున దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ఇప్పుడు ఔరంగాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లో ప్రారంభించింది, అయితే ఈ కొత్త SUV యొక్క విడుదల తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కానీ Audi India (ఆడి ఇండియా) చీఫ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' (Balbir Singh Dhillon) ఈ SUV నవంబర్ నెలలో విడుదలవుతుందని ఇంతకుముందే తెలిపారు.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో ఆడి కంపెనీ మంచి ప్రజాదరణ పొందింది. ఈ కారణంగానే కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ మార్కెట్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతోంది. కావున ఈ కొత్త ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ త్వరలో లాంచ్ అవుతుంది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

ఆడి ఇండియా భారతీయ మార్కెట్లో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా కంపెనీ తన SUV లను పెద్దమొత్తంలో అప్డేట్ చేయలేదు. ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, మేము బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా మా తదుపరి ఉత్పత్తిని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్నాము, అన్నారు.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

ఆడి క్యూ 5 అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటి. ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో కంపెనీ 115% అమ్మకాల వృద్ధిని నమోదు చేయడానికి ఆడి కంపెనీ యొక్క క్యూ 5 SUV ఎంతగానో సహకరించింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటుంది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త 2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ విషయానికి వస్తే, ఈ కొత్త SUV మునుపటికంటే కూడా చాలా స్పోర్టివ్‌గా కనిపిస్తోంది, ఇది హానీ కూంబ్ నమూనాతో పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఉంది. 2021 Audi Q5 Facelift యొక్క ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కస్టమైజ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లతో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. వీటితో పాటు కారు యొక్క టెయిల్‌గేట్ కూడా మార్చబడింది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

Audi Q5 Facelift యొక్క వెనుక భాగం కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది. ఈ కొత్త కారు మునుపటి మోడల్ కంటే కూడా చాలా వెడల్పుగా కనిపిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త Audi Q5 Facelift చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

Audi Q5 Facelift యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, సాధారణ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్ మరియు కొత్త క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ మధ్య చాలా పోలికలు ఉండవచ్చు. అయితే, సెంటర్ కన్సోల్‌లోని డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ తొలగించబడింది. అయితే ఇందులో లేటెస్ట్ 10.1-ఇంచెస్ ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉంటాయి.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

ఇవి మాత్రమే కాకుండా ఇందులో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొత్త 2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్‌లో అందించబడతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త కారులో 12-వోల్ట్ లైట్ వెయిట్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇది A6 వలె, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో, కంపెనీ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ శక్తిని తన నాలుగు చక్రాలకు ప్రసారం చేస్తుంది.

2021 Audi Q5 Facelift ఉత్పత్తి ఇకపై భారత్‌లో.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Audi Q5 Facelift ధర అధికారికంగా ప్రకటించబడలేదు, కానీ ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 55 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదల చేసే అవకాశం ఉంటుంది. భారతీయ మార్కెట్లో Audi Q5 Facelift కొత్త Mercedes-Benz GLC (మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్), BMW X3 (బీఎండబ్ల్యూ ఎక్స్3), Lexus NX (లెక్సస్ ఎన్ఎక్స్) మరియు Volvo XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New 2021 audi q5 facelift production starts in india expected launch soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X