Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
మోదీ ఎన్నికల సభ రద్దు వట్టిదే -వర్చువల్ ప్లాన్ -బెంగాల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధించిన ఈసీ
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- Movies
మరణం తర్వాత కూడా తీరని వివేక్ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి లాంచ్ డేట్ - డీటేల్స్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 మోడల్ ఇయర్ 6-సిరీస్ కారును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 8, 2021వ తేదీన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఇప్పటికే భారత మార్కెట్లో లభిస్తోంది, కాగా, కంపెనీ ఇందులో ఇప్పుడు ఓ మిడ్-లైఫ్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతోంది. కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాండ్ టురిస్మో (జిటి) మోడల్‌కి కంపెనీ స్టైలింగ్ అప్‌డేట్‌ను జోడించింది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటిలో స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లను కూడా జోడించారు. ఈ 4-డోర్ వెర్షన్ గ్రాండ్ టూరర్ యొక్క అప్‌గ్రేడెడ్ మోడల్ 2020 సంవత్సరం చివరిలోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఏప్రిల్ 8న ఈ కారు కొత్త అప్‌డేట్స్ మరియు ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 జిటి మరింత స్పోర్టియర్ స్టైలింగ్‌తో అందించబడుతుంది. దీని ముందు భాగంలో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌ను అప్‌గ్రేడ్ చేశారు. అయితే, ఇది కొత్త బిఎమ్‌డబ్ల్యూ 4 సిరీస్ మాదిరిగా పెద్దదిగా ఉండదు.

ఇవే కాకుండా, ఇందులో రీడిజైన్ చేయబడిన సన్నటి అడాప్టివ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి, వీటిని పార్శ్వంగా ఉంచవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి మోడళ్లలో కంపెనీ తమ లేజర్ లైట్ టెక్నాలజీని ఆప్షనల్‌గా అందిస్తోంది.
MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

భారత మార్కెట్లో విడుదల కాబోయే కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి మోడల్‌లో కంపెనీ డ్యూయల్ ఎల్-ఆకారపు ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లను ఆఫర్ చేయవచ్చు. దీని వెనుక భాగంలో బ్లాక్-అవుట్ డిఫ్యూజర్ మరియు ట్విన్ ట్రాపెజోయిడల్ ఎగ్జాస్ట్ పైప్స్ ఉంటాయి.

కాగా, దీని సైడ్ ప్రొఫైల్ మరియు స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ లైట్స్‌లో ఎలాంటి మార్పులు లేనట్లుగా తెలుస్తోంది. ఇవి చూడటానికి పాత మోడల్ మాదిరిగానే అనిపిస్తాయి. ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఓవరాల్ క్యాబిన్ లేఅవుట్ మునుపటిలానే ఉంటుంది. అయితే, ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను ఆశించవచ్చు.
MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఇంటీరియర్స్‌లో ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీ ఉండనుంది. అలాగే, కంపెనీ యొక్క 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ మోడల్‌లో చూసినట్లుగా, 6 సిరీస్ జిటిలో పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు అప్‌గ్రేడ్ చేయబడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ అప్‌గ్రేడెడ్ 6 సిరీస్ జిటిలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదివరకటి మోడల్‌లో ఆఫర్ చేసిన ఇంజన్లనే ఇందులో కొనసాగించే అవకాశం ఉంది. ఇందులోని ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో మరింత శక్తివంతమైన 3.0-లీటర్, 6-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. సాధారణ మోడళ్లలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్లను ఆఫర్ చేయవచ్చు.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి