పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ (Ecosport) లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో గత కొంతకాలంగా కంపెనీ ఈ అప్‌డేటెడ్ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది. ఇటీవల ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ను ఇంకా కంపెనీ వెల్లడించనప్పటికీ, ఇది అక్టోబర్ చివరి నాటికి భారత మార్కెట్లో కావచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు Ford India గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో Ford India బ్రాండ్ నుండి Ecosport మరియు Endeavour మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో Ecosport గత కొంత కాలంగా మార్కెట్లో ఉంది. ఈ మోడల్ విడుదలైన కొత్తల్లో దాని స్టైలిష్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

అయితే, ఇటీవలి కాలంలో భారత కాంపాక్ట్ ఎస్‌యూవీలో కొత్తగా అనేక మోడళ్లు ప్రవేశించాయి. దీంతో పెరిగిన పోటీ కారణంగా, Ecosport అమ్మకాలు కూడా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో Ecosport అమ్మకాలను పెంచుకునేందుకు Ford ఈ ఎస్‌యూవీని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా మోడ్రన్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయనుంది.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ఇటీవల లీకైన చిత్రాల ప్రకారం, కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్టీరియర్ లో చేసిన మార్పులను గమనిస్తే, ఇందులో అంచుల చుట్టూ క్రోమ్ లైనింగ్ మరియు కొత్త ఇన్సర్ట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్, తిరగేసిన L- ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

అంతేకాకుండా, ముందు వైపు దిగువ భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు రివైజ్డ్ ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ యూనిట్‌లను కూడా ఇందులో గమనించవచ్చు. కాకపోతే, దీని హెడ్‌ల్యాంప్ యూనిట్స్, సైడ్ మిర్రర్స్, అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ఇక క్యాబిన్ లోపల చేయబోయే మార్పుల విషయానికి వస్తే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త సీట్ అప్‌హోలెస్ట్రీ, ఇల్యుమినేటెడ్ అండ్ కూల్డ్ గ్లవ్ బాక్స్, అప్‌డేట్ చేయబడిన కనెక్టింగ్ టెక్నాలజీ, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ సపోర్ట్, SYNC3 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మరికొన్ని ఇతర డిజైన్ మార్పులను ఇందులో ఆశించవచ్చు.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

కొత్త Ecosport ఫేస్‌లిఫ్ట్ ను అంబియంట్, ట్రెండ్, ట్రెండ్+, టైటానియం మరియు టైటానియం+ అనే ఐదు ట్రిమ్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఫేస్‌లిఫ్టెడ్ Ecosport మోడల్ లైనప్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కొత్త ఫేస్‌లిఫ్టెడ్ Ecosport లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ లు, రివర్సింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సర్దుబాటు చేయగల స్పీడ్ లిమిటింగ్ పరికరంతో కూడిన క్రూయిజ్ కంట్రోల్, వెనుకవైపు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఆటోమేటిక్ వైపర్స్ మరియు ప్యాడిల్ షిఫ్టర్లు (AT వేరియంట్ లో మాత్రమే) మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Ecosport కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన అవే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ఈ కొత్త మోడల్ లోనూ కొనసాగించే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 3 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 149 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్ యూనిట్ గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ (స్టాండర్డ్) మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ (పెట్రోల్ వేరియంట్‌లలో మాత్రమే) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Ford Ecosport ధరలు రూ. 8.19 లక్షల నుండి రూ. 11.69 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కాగా, కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో చేయబోయే అప్‌గ్రేడ్స్ కారణంగా, దీని ధరలు ప్రస్తుత వెర్షన్ ధరల కన్నా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ లాంచ్

భారత్‌లో Ford Figo ఆటోమేటిక్ వేరియంట్ విడుదల

ఇదిలా ఉంటే, Ford India గత నెలలో తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ Ford Figo లో ఓ ఆటోమేటిక్ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందించబడుతుంది మరియు ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి టైటానియం, టైటానియం ప్లస్. వీటి ధరలు వరుసగా రూ. 7.75 లక్షలు మరియు రూ. 8.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
New 2021 ford ecosport facelift india launch timeline and design updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X