కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అందిస్తున్న ఫ్లాగ్‍షిప్ ఎస్‌యూవీ 'ఎఫ్-పేస్'లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఇప్పటికే కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ఆర్-డైనమిక్ ఎస్ ట్రిమ్‌లో అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. భారతదేశంలో ఈ కొత్త వెర్షన్ జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు వచ్చే మే నెల నుండి ప్రారంభం కానున్నాయి.

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇదివరకటి మాదిరిగానే భారతదేశంలోనే అసెంబుల్ చేయనున్నారు. త్వరలోనే ఈ మోడల్ ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. ఇందులో డైమండ్ మెష్ గ్రిల్, కొత్తగా రూపొందించిన బంపర్స్, మజిక్యులర్ బోనెట్, ఫ్రంట్ ఫెండర్ వెంట్స్‌పై యాంబ్లమ్స్, పదునైన ఎల్‌ఇడి టెయిల్ లాంప్, కొత్త ఎల్-ఆకారపు ఎల్‌ఇడి లైటింగ్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

కొత్త 2021 మోడల్ జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద మార్పులు చూడవచ్చు. క్యాబిన్ లోపల లెదర్ ట్రిమ్‌తో తయారు చేసిన కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త 11.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త పివి ప్రో టెక్నాలజీ ఇందులో ఉంటాయి.

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

ఆటోమేటిక్ ఎసి కోసం కొత్త కంట్రోల్స్, సిగ్నేచర్ జాగ్వార్ చిహ్నంతో కూడిన కొత్త హెడ్‌రెస్ట్స్ మరియు కొత్త ఇంటీరియర్ ట్రిమ్మింగ్ ఉంటుంది. అలాగే, జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త స్టీరింగ్ వీల్, కొత్త గేర్ సెలెక్టర్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్యాబిన్ ఎయిర్ అయానైజర్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

గ్లోబల్ మార్కెట్లలో జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ నాలుగు తేలికపాటి హైబ్రిడ్‌లు మరియు కొత్త పిహెచ్‌ఇవి, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. అయి,తే భారతదేశంలో మాత్రం ఇది కేవలం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది.

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

ఇందులో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 205 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 300 హెచ్‌పిల పవర్‌ను జనరేట్ చేస్తుంది. మెరుగైన రైడ్ క్వాలిటీ కోసం కంపెనీ దీని ఛాస్సిస్ మరియు సస్పెన్షన్ సెటప్‌లో కూడా మార్పులు చేసింది.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

కాగా, జాగ్వార్ తమ భవిష్యత్ మోడళ్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్లను పూర్తిగా నిలిపివేసి కేవలం ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే వాహనాలను మాత్రమే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 2030 నాటికి జాగ్వార్ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని ప్లాన్ చేస్తోంది.

కొత్త 2021 జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్

జాగ్వార్ అనుబంధ సంస్థ యుటిలిటీ వెహికల్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేయాలనే ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసింది. వచ్చే 2025 నుండి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తుందని జాగ్వార్ తెలిపింది. జాగ్వార్ ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఐ-పేస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు పూర్తి ఛార్జీపై 480 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

Most Read Articles

English summary
New 2021 Jaguar F-Pace Facelift Bookings Open, Deliveries Will Start In May. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X