మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ జీప్, తమ మేడ్ ఇన్ ఇండియా జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. రూ.53.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

తాజాగా, ఈ మోడల్ కోసం కంపెనీ అఫీషియల్ యాక్ససరీల జాబితాను వెల్లడి చేసింది. జీప్ వ్రాంగ్లర్ కస్టమర్లు తమ ఎస్‌యూవీని మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ఈ మోడల్ కోసం కంపెనీ 120 యాక్ససరీలను అందిస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

ఈ యాక్ససరీస్‌లో ఎక్స్టీరియర్ కోసం ఫ్రంట్ అండ్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్ప్లాష్ గార్డ్స్, మ్యాట్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, సైడ్ విండో ఎయిర్ డిఫ్లెక్టర్, ఫ్రంట్ ఎయిర్ డిఫ్లెక్టర్, బ్లాక్ అండ్ క్రోమ్ సైడ్ స్టెప్, విండ్‌షీల్డ్ టై-డౌన్ స్ట్రాప్స్, రూఫ్ రాక్ మరియు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

ఇంకా ఫ్రంట్ బోనెట్‌పై ఇరువైపులా లేదా బోనెట్ ముందు భాగంలో అమర్చడానికి వీలుండే ఐదు లేదా ఏడు అంగుళాల ఎల్ఈడి లైట్స్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. స్పేర్ వీల్ మరియు జీప్ బ్యాడ్జ్‌ల కోసం కంపెనీ వివిధ రకాల కలర్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్టీరియర్ యాక్ససరీలతో కస్టమర్లు తమ వ్రాంగ్లర్ మరింత స్టైలిష్‌గా మార్చుకోవచ్చు.

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

ఇక ఇంటీరియర్ యాక్ససరీస్ విషయానికి వస్తే, ఇందులో ఆల్-వెదర్ ఫ్లోర్ మాట్స్, కార్పెట్ ఫ్లోర్ మాట్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిస్ప్లే స్క్రీన్ కోసం స్క్రీన్ ప్రొటెక్టర్ మొదలైనవి ఉన్నాయి. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం స్టోరేజ్ బ్యాగ్, వించ్ కిట్, కార్గో నెట్, టెయిల్‌గేట్ టేబుల్, ల్యాప్‌టాప్ / టాబ్లెట్ హోల్డర్ వంటి యాక్ససరీలు కూడా ఉన్నాయి.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

ఇవే కాకుండా, లంబార్ కుషన్, నెక్ రెస్ట్, కార్ పెర్ఫ్యూమ్స్, టిష్యూ బాక్సులు వంటివి కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న యాక్ససరీలను మాత్రమే కాకుండా, కంపెనీ తమ వ్రాంగ్లర్ కోసం ఎక్స్‌ప్లోరర్, నైట్ అల్ట్రా విజన్, స్పోర్ట్స్ మరియు ఎస్సెన్షియల్స్ అనే నాలుగు ప్రత్యేకమైన యాక్సెసరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

జీప్ ఈ యాక్ససరీలన్నింటినీ పూణేలోని చాకన్‌కు చెందిన జీప్ అధీకృత విడిభాగాల సరఫరాదారైన మోపార్ పార్ట్స్ విక్రయిస్తుంది. కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ విషయానికి వస్తే, ఇది అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వెర్షన్లలో లభ్యం కానుంది. వాటి ధరలు వరుసగా రూ.53.90 లక్షలు మరియు రూ.57.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

మేడ్ ఇన్ ఇండియా వ్రాంగ్లర్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన జీప్

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 268 బిహెచ్‌పి పవర్‌ను 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇంజన్ ద్వారా విడుదలయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
New 2021 Jeep Wrangler Accessories Details Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X