కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఎస్‌యూవీలో కంపెనీ అనేక అప్‌గ్రేడ్స్ చేసింది. ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి చెందిన పెర్ఫార్మెన్స్ వాహన విభాగం (ఎస్‌విఆర్) ప్రత్యేకంగా ఈ కారుని డిజైన్ చేసింది. ఇందులో శక్తివంతమైన సూపర్ఛార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన ల్యాండ్ రోవర్ కారు అవుతుంది. భారతదేశంలో ఇది ఒకే వేరియంట్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ కారును యూకేలో తయారు చేసి, అక్కడి నుండి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారతదేశానికి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. అందుకే, ఈ కారు ధర కూడా అంత అధికంగా ఉంటుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

భారతదేశంలో అమ్మకం కానున్న ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీ, ఇక్కడి మార్కెట్లో ఇది ఆ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 567 బిహెచ్‌పి శక్తి మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క తేలికపాటి అల్యూమినియం ఆర్కిటెక్చర్‌తో కలిసి ఉంటుంది మరియు దీని కారణంగా ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 283 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ల్యాండ్ రోవర్ యొక్క విప్లవాత్మక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో ఇంజన్ ద్వారా విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. పంపబడుతుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీ యొక్క ఆల్-టెర్రైన్ సామర్ధ్యంతో రాజీ పడకుండా చాస్సిస్ మరింత డైనమిక్ హ్యాండ్లింగ్ కోసం బెస్పోక్ మెరుగుదలలతో అమర్చబడిందని ల్యాండ్ రోవర్ తెలిపింది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ స్టాండర్డ్ రేంజ్ రోవర్ స్పోర్ట్ వేరియంట్ కంటే మెరుగైన డిజైన్ మరియు లుక్‌ని కలిగి ఉండటానికి, కంపెనీ ఈ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో అనేక డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇందులో చేసిన కొన్ని ప్రధానమైన అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఈ కారులోని బ్రేక్‌లను త్వరగా చల్లబరచడానికి బంపర్‌లో కొత్త మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ ఇవ్వబడ్డాయి.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అధిక ఉష్ణోగ్రతల వద్ద మెరుగైన పనితీరు కోసం బ్రేక్ ప్యాడ్‌లు మరియు డిస్క్‌లు కూడా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీ వెనుక భాగంలో బాడీ కలర్ డీటేలింగ్స్ మరియు స్టాండర్డ్ వెర్షన్ నుండి ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్‌ను వేరు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఎస్‌విఆర్ బ్యాడ్జ్ మొదలైన మార్పులు ఉంటాయి.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఎస్‌యూవీలో కంఫర్ట్, గ్రాస్ / గ్రావెల్ / స్నో, మడ్ అండ్ రూట్స్, శాండ్ మమరియు ఎకో అనే ఐదు మాన్యువల్ టెర్రైన్ రెస్పాన్స్ సెట్టింగులు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది అసాధారణమైన పనితీరును మరియు సమతుల్యతను అందిస్తుంది. ఇందులోని ఎయిర్ సస్పెన్షన్ సంబంధిత రైడ్ మోడ్‌లతో కలిసి దానికి అనుగుణంగా పనిచేస్తుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బూట్-లిడ్‌పై కార్బన్-ఫైబర్ ఇన్‌సెర్ట్, వెనుక వైపు ప్రత్యేకమైన ఎస్‌విఆర్ బ్యాడ్జింగ్, 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ కొత్త వెర్షన్ ఎస్‌యూవీని ఎక్స్టీరియర్‌తో పాటుగా ఇంటీరియర్స్‌లో కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఎస్‌విఆర్ స్పోర్టీ థీమ్ క్యాబిన్‌లో కూడా క్యారీ చేయబడింది. ఇంకా ఇందులో 19-స్పీకర్ మెరిడియన్ సరౌండ్ ఆడియో సిస్టమ్, డ్యూయెల్-ఛానల్ సబ్ వూఫర్, 10 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లమైట్ కంట్రోల్ మరియు సీట్ హీటింగ్ కోసం టచ్‌స్క్రీన్, పానోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ లెథర్ ఫినిష్డ్ డాష్‌బోర్డ్, స్టీరింగ్ మరియు సీట్లు మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ ఎస్‌విఆర్‌లో డ్రైవర్ కండిషన్ మానిటర్ మరియు 360-డిగ్రీ కెమెరాతో సహా అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, రోల్ స్టెబిలిటీ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ మరియు 8 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. అంతేకాకుండా, కస్టమర్లు ఎంచుకోవడం కోసం కంపెనీ డ్రైవ్ ప్రో ప్యాక్ మరియు పార్క్ ప్రో ప్యాక్‌లు అనే ఆప్షనల్ సేఫ్టీ ప్యాక్‌లను కూడా కంపెనీ అందిస్తోంది.

Most Read Articles

English summary
New 2021 Range Rover Sport SVR Launched In India: Price, Specs, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X