త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే 2021 Renault Kwid

వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, ఫ్రెంచ్ కార్ల తయారీ రెనాల్ట్ భారత మార్కెట్లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. కావున కంపెనీ ఇప్పుడు 10 వ యానివెర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. కంపెనీ యొక్క ఈ 10 వ యానివర్సరీ సందర్భంగా భారతీయ మార్కెట్లో కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ ప్రారంభించింది.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 4.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇందులోకి టాప్ మోడల్ ధర రూ. 5.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ ని 0.8 లీటర్ మరియు 1.0 లీటర్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో విడుదల చేసింది.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

కొత్త 2021 Renault Kwid యొక్క డిజైన్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇందులో కొంతవరకు అప్డేట్స్ జరిగినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ అప్డేట్ చేయబడ్డాయి. కావున ఇది మునుపటికంటే కూడా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

అప్డేట్ చేయబడిన కొత్త కొత్త 2021 Renault Kwid యొక్క అన్ని వేరియంట్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులో ఉన్నాయి, తద్వారా ఇది కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన మోడల్ ముందు డ్రైవర్ సైడ్ పైరోటెక్ & ప్రీటెన్షనర్‌తో కూడా వస్తుంది.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

ఇవి మాత్రమే కాకుండా Kwid యొక్క స్టాండర్డ్ సేఫ్టీ కిట్‌లో రియర్ సెన్సార్లు, స్పీడ్-అలర్ట్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

కొ2021 Renault Kwid ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. అంటే ఇది ఇప్పుడు వైట్ విత్ బ్లాక్ రూఫ్ కలిగి ఉంటుంది. ఈ కొత్త కారు ఎలక్ట్రిక్ ORVM మరియు డే అండ్ నైట్ IRVM ని కూడా పొందుతుంది. దీనితో పాటు ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

Renault Kwid యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ కాగా, రెండవది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని మునుపటిది 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 54 బిహెచ్‌పి పవర్ మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట శక్తిని చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 68 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

Renault India తన ఉత్పత్తులపై ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 2021 సెప్టెంబర్ నెలలో కొత్త రెనాల్ట్ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు దాదాపు రూ. 80,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇవన్నీ సాధారణ వినియోగదారుల కంటే ఎక్కువగా లాభాలను కలిగిస్తాయి.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

త్వరలో రానున్న వినాయక చవితిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ గుజరాత్, మహారాష్ట్ర మరియు గోవాలోని వినియోగదారులకు మరిన్ని ఆఫర్లను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా కంపెనీ యొక్క Kwid, Triber మరియు Kiger కొనుగోలుపై ‘ఇప్పుడు కొనుగోలు చేయండి, 2022 లో చెల్లించండి' (Buy Now, Pay in 2022) అనే స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

త్వరపడండి.. కేవలం రూ. 4.06 లక్షలకే కొత్త Renault Kwid

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Renault Kwid (రెనాల్ట్ క్విడ్) ప్రభుత్వం ఆదేశించిన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇప్పుడు ఈ మోడల్ మునుపటికంటే కూడా ఎక్కువ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల మార్కెట్లో మంచి అమ్మకాలను కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఆఫర్లు కూడా అమ్మకలకు మరింత దోహదపడతాయి. ధర కూడా తక్కువ కావున ఈ మోడల్ ఎటువంటి అమ్మకాలను నమోదు చేస్తుంది, అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 renault kwid launched in india at rs 4 06 lakhs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X