కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్ నేడు మార్కెట్లో విడుదలైంది. దేశీయ విపణిలో ఈ కొత్త తరం స్కొడా ఆక్టేవియా సెడాన్ ప్రారంభ ధర రూ.25.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. భారతదేశంలో కొత్త ఆక్టేవియా డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

వేరియంట్లు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను స్టైల్ మరియు ఎల్ అండ్ కె (లౌరిన్ అండ్ క్లెమెంట్) అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు. స్టైల్ వేరియంట్ ధర రూ.25.99 లక్షలు కాగా, టాప్-ఎండ్ ఎల్ అండ్ కె వేరియంట్ ధర రూ.28.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

కలర్ ఆప్షన్స్

కొత్త స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ బ్రిలియంట్ సిల్వర్, మాపుల్ బ్రౌన్, కాండీ వైట్, లావా బ్లూ మరియు మ్యాజిక్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది. కాగా, స్టైల్ వేరియంట్ మాత్రం కాండీ వైట్, లావా బ్లూ మరియు మ్యాజిక్ బ్లాక్ కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

కలర్ ఆప్షన్స్ కాకుండా, కొత్త 2021 స్కొడా ఆక్టేవియాలోని స్టైల్ మరియు ఎల్ అండ్ కె రెండు వేరియంట్ల మధ్య కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. స్టైల్ వేరియంట్‌లో సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రికల్-ఆపరేటెడ్ బూట్ లిడ్‌తో పాటు గెశ్చర్ కంట్రోల్, పవర్ అడ్జస్టబల్ ఫ్రంట్ కో-ప్యాసింజర్ సీట్, కాంటన్ ప్రీమియం సౌండ్-సిస్టమ్ మరియు స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్‌ వంటి ఫీచర్లు ఉండలు. ఇవన్నీ ఎల్ అండ్ కె వేరియంట్లో లభిస్తాయి. ఇకపోతే, ఈ రెండు వేరియంట్లలో సన్‌రూఫ్ ఫీచర్ ఉండదు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

ఇంజన్ డీటేల్స్

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను ప్రస్తుతానికి ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందిస్తున్నారు. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. స్కొడా ఆక్టేవియా ఇప్పుడు బ్రాండ్ యొక్క 2.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులో 1.5-లీటర్ టిఎస్‌ఐ ఇంజన్‌ను తరువాత దశలో అందుబాటులోకి తీసుకురావచ్చని కంపెనీ తెలిపింది.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

ఈ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 4,180-6,000 ఆర్‌పిఎమ్ మధ్యలో గరిష్టంగా 190 బిహెచ్‌పి శక్తిని మరియు 1,500-3,990 ఆర్‌పిఎమ్ మధ్యలో 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌గా గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండదు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను అప్‌గ్రేడ్ చేయబడిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించారు. ఈ కొత్త మోడల్ మునుపటి బిఎస్4 మోడల్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా మరియు విశాలంగా ఉంటుంది. ఈ కొత్త-తరం సెడాన్ లోపల మరియు వెలుపల డిజైన్ అప్‌డేట్స్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

ఎక్స్టీరియర్ ఫీచర్లు

ఆక్టేవియా సెడాన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన క్రిస్టల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద బటర్‌ఫ్లై-గ్రిల్, కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బూట్-లిడ్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, వాషర్‌తో కూడిన రియర్-వ్యూ కెమెరా మరియు బూట్-లిడ్ పొడవు అంతటా విస్తరించిన పెద్ద స్కొడా బ్యాడ్జ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

ఇంటీరియర్ ఫీచర్లు

కొత్త 2021 ఆక్టేవియా ఇంటీరియర్స్‌లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ మరియు రీడిజైన్ చేయబడిన క్యాబిన్ లేఅవుట్ ఉంటుంది. ఈ సెడాన్‌లో రెండు పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకదానిని ఇన్ఫోటైన్‌మెంట్ స్కీన్ గానూ మరొక దానిని డ్రైవర్ సమాచారం కోసం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గానూ ఉపయోగిస్తారు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

కొత్త స్కోడా ఆక్టేవియా యొక్క ఇంటీరియర్స్లో లేత గోధుమరంగు స్వీడియా తోలు అప్హోల్స్టరీ మరియు పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్స్ మరియు యాంబియంట్ లైటింగ్ ఉన్న డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ ఉన్నాయి. కొత్త సెడాన్ యొక్క మరో హైలైట్ కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్స్, దీనిలో పాడిల్ షిఫ్టర్లు మరియు ఆడియో, క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్లు మరియు మరెన్నో కోసం మౌంటెడ్ కంట్రోల్ ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

ఈ ప్రీమియం సెడాన్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో మల్టిపుల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్స్, రిమోట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు మరియు టచ్ సెన్సిటివ్ రీడింగ్ లాంప్స్ ఉన్నాయి. బూట్ స్పేస్ విషయానికి వస్తే, కొత్త ఆక్టేవియాలో 600 లీటర్ల స్టాండర్డ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకునే వారి కోసం 60:40 స్ప్లిట్ రియర్ సీట్ ఆప్షన్ ఉంటుంది, దీని ద్వారా బూట్ స్పేస్‌ను 1555 లీటర్లకు పెంచుకోవచ్చు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

సేఫ్టీ ఫీచర్లు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సేఫ్టీ ఫీచర్లలో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టిపిఎంఎస్, ఇఎస్‌సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హెచ్‌హెచ్‌సి (హిల్ హోల్డ్ కంట్రోల్), హెచ్‌బిఎ (హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్) మరియు ఆటో హోల్డ్‌తో ఇ-పార్కింగ్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. ఎల్ అండ్ కె వేరియంట్లో పార్క్ అసిస్ట్, ఐబజ్ ఫెటీగ్ అలర్ట్ మరియు ఇతర యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా లభిస్తాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; ధర రూ.25.99 లక్షలు మాత్రమే!

మొత్తంగా చూసుకుంటే, ఈ కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్ మునుపటి తరం మోడల్ కంటే అనే విధాలుగా మెరుగ్గా అనిపిస్తుంది. విశాలమైన క్యాబిన్, లేటెస్ట్ టెక్నాలజీ, మోడ్రన్ ఫీచర్లతో ఇది కస్టమర్లను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ కారును ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - కొత్త స్కొడా ఆక్టేవియా యొక్క పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
New 2021 Skoda Octavia Launched In India: Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X