రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో తమ నాల్గవ తరం ఆక్టేవియా సెడాన్‌ను రేపు (గురువారం) భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ వారంలోనే కొత్త 2021 స్కొడా ఆక్టేవియా డెలివరీలు కూడా ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

ఈ నాల్గవ తరం స్కొడా ఆక్టేవియాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 2019లో ప్రవేశపెట్టారు, తాజాగా ఇది భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ కారును టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. - ఈ కారు యొక్క పూర్తి సమీక్షను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను లావా బ్లూ, మ్యాజిక్ బ్లాక్, కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు మాపుల్ బ్రౌన్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో విక్రయించనున్నారు. ఈ కారు స్టైల్ మరియు ఎల్ అండ్ కె అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. మరియ ఏయే వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో.. లేటెస్ట్ ఫీచర్స్ & సూపర్ పర్ఫామెన్స్

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

కొత్త స్కొడా ఆక్టేవియా స్టైల్ ఫీచర్లు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా స్టైల్ వేరియంట్‌లో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, పడల్ ల్యాంప్స్, ఫ్రంట్ సీట్-బెల్ట్ రిమైండర్, ఏబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్‌సి, ఇబిడి, ఎమ్‌కెబి, హెచ్‌హెచ్‌సి, హెచ్‌బిఎ, ఎఎస్ఆర్, ఇడిఎస్ మరియు టిపిఎమ్‌ఎస్ ఫీచర్లు లభిస్తాయి.

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

అంతే కాకుండా, ఇందులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రియర్ కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్ మరియు షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

ఈ స్టైల్ వేరియంట్లో, వినియోగదారులకు ఎత్తు-సర్దుబాటు చేయగల ఫ్రంట్ సెంటర్ ఆర్మ్-రెస్ట్, కప్ హోల్డర్‌తో కూడిన వెనుక సీట్ ఆర్మ్-రెస్ట్, బేజ్ కలర్ లెథర్ అప్‌హోలెస్ట్రీ, లెథర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎనిమిది స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

ఇవే కాకుండా, ఈ వేరియంట్‌లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సర్దుబాటు చేయగల వెనుక ఏసి వెంట్స్, వర్చువల్ కాక్‌పిట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ వైపర్స్, ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, సెంటర్ కన్సోల్‌లో 2 టైప్-సి యుఎస్‌బి ఛార్జింగ్ సాకెట్లు, బూట్‌స్పేస్‌లో 12వి పవర్ సాకెట్ కూడా లభిస్తుంది. ఇంకా ఇందులో కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా ఉంటుంది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా ఎల్ అండ్ కె వేరియంట్

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా యొక్క ఎల్ అండ్ కె వేరియంట్‌లో అల్యూమినియం పెడల్స్, అడాప్టివ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఫెటీగ్ అలర్ట్, వర్చువల్ బూట్ రిలీజ్ పెడల్ మరియు ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లతో పాటుగా స్టైల్ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు కూడా లభిస్తాయి.

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

అంతేకాకుండా, ఇందులో మెమరీ ఫంక్షన్‌తో 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, కాంటన్-సోర్స్డ్ 11 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, రియర్ విండోస్ మరియు రియర్ విండ్‌స్క్రీన్ కోసం సన్ విజర్, వైర్‌లెస్ ఛార్జర్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, వెనుక 2 టైప్-సి యుఎస్‌బి సెంటర్ కన్సోల్. ఐఆర్‌విఎస్ ఛార్జింగ్ సాకెట్ మరియు 1 టైప్-సి యూఎస్‌బి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటాయి.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

రేపే 2021 స్కొడా ఆక్టేవియా విడుదల; వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు

ఇంజన్

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 స్కొడా ఆక్టేవియా రెండు వేరియంట్లు కూడా ఒకే ఇంజన్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. ఇందులోని 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
New 2021 Skoda Octavia Launching Tomorrow; Variant Wise Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X